logo

గంటలోనే ముంచేసింది

నగరంలో ఆదివారం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సాయంత్రం గంటపాటు కురిసిన వర్షానికి లోతట్టు దారులు చెరువుల్లా మారాయి.

Published : 11 Sep 2023 03:46 IST

సరూర్‌నగర్‌లో కుండపోతగా కురుస్తున్న వర్షం

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో ఆదివారం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సాయంత్రం గంటపాటు కురిసిన వర్షానికి లోతట్టు దారులు చెరువుల్లా మారాయి. ఖైరతాబాద్‌ చౌరస్తా, పంజాగుట్ట, ఎర్రగడ్డ మూసాపేట, మాసాబ్‌ట్యాంక్‌ ఫ్లైఓవర్‌ పక్కన వరదతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. వర్షం పడితే చాలు ఇక్కడ వరద పారుతోంది. కృష్ణానగర్‌లో ఎప్పటిలాగానే కాలనీ రోడ్లను వరద ముంచెత్తింది. మధ్యలో తెరపిస్తూ రాత్రి వరకు వర్షం కురుస్తూనే ఉంది. గోల్కొండ, ముషీరాబాద్‌లో గరిష్ఠంగా 4.3 సెం.మీ., సరూర్‌నగర్‌లో 4 సెం.మీ. కురిసింది.

3 నిమిషాలకో మెట్రో.. వర్షం పడడంతో మెట్రో రైలు వేగాన్ని పెంచింది.ఆదివారం ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రతి 3 నిమిషాలకు మెట్రోలు నడిపి కాస్త ఊరటనిచ్చారు.


వర్షం వేళ.. కష్టాల ప్రయాణం

ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి నగరంలో వర్షం జోరందుకుంది. సెలవురోజు కావడంతో తీవ్రమైన ట్రాఫిక్‌ సమస్య తలెత్తలేదు కానీ.. సాధారణ ప్రయాణికులకు బస్సులు దొరకలేదు. షెల్టర్లు లేని బస్టాపుల్లో ప్రయాణికులు వానలోనే నిరీక్షిస్తున్నారు. అసలే ఆదివారం 20 శాతం సర్వీసులు డిపోలకు పరిమితమవుతుంటే.. మరో 10 శాతం బస్సులు వర్షాల కారణంగా మధ్యాహ్నం షిఫ్టులో డిపోలు దాటలేదు. వీటికి తోడు ఎంఎంటీఎస్‌ సర్వీసులు రద్దుతో సామాన్యుడి ప్రయాణం కష్టంగా మారింది. నిత్యం పదుల సంఖ్యలో ఎంఎంటీఎస్‌ సర్వీసులు రద్దవుతుండడంతో జనం ఆ స్టేషన్‌ వైపు వెళ్లడానికి కూడా సాహసించడంలేదు.

ఎన్టీఆర్‌నగర్‌లో కాలువను తలపిస్తున్న వీధి

 

సచివాలయం వద్ద చెట్టు నీడలో తలదాచుకున్న వాహనదారులు

 

ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌ వద్ద

 

అశోక్‌నగర్‌లో పాదచారుల అవస్థలు

 

ఆర్టీసీ క్రాస్‌రోడ్డు మెట్రోస్టేషన్‌ వద్ద వరద వెళ్లేలా చర్యలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని