logo

బెట్టింగ్‌లతో అప్పులపాలై.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు అలవాటుపడ్డ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Published : 20 May 2024 06:37 IST

విజయ్‌ కుమార్‌రెడ్డి  

పేట్‌బషీరాబాద్, న్యూస్‌టుడే: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు అలవాటుపడ్డ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పేట్‌బషీరాబాద్‌ ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం... మేడ్చల్‌ మండలం గుండ్లపోచంపల్లికి చెందిన విజయ్‌కుమార్‌రెడ్డి(25) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. అతనికి ఆరు నెలల క్రితం వివాహమైంది. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో తీవ్రంగా అప్పుల పాలయ్యాడు. దీంతో అప్పుల బాధ తట్టుకోలేక శనివారం రాత్రి పడక గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ఎంతకీ స్పందన లేకపోవడంతో కుటుంబ సభ్యులు గది తలుపు బద్దలుగొట్టి తీసి చూసే సరికి అప్పటికే మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని