logo

దక్షిణాది ముగిసింది.. ఉత్తరాది రమ్మంది

నగరంలో నాలుగు ఎంపీ సీట్లతో పాటు.. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ శాసనసభ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి.

Updated : 21 May 2024 08:26 IST

అక్కడి ప్రచారానికి తరలివెళ్లిన నగర నాయకులు

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో నాలుగు ఎంపీ సీట్లతో పాటు.. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ శాసనసభ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి. ఈ పరిస్థితిలో గత ఆదివారానికి, ఈ వారానికి ఎంతో తేడా కనిపించింది. గత సోమవారం ఎన్నికలు జరగడంతో అంతకు ముందు రోజు ఆదివారం అభ్యర్థులు ఎంతో ఉత్కంఠకు గురయ్యారు. కంటిపై కునుకు లేకుండా ఓటర్లను పోలింగ్‌ కేంద్రాల వరకు తీసుకెళ్లడంపై ప్రత్యేక దృష్టి నిలిపారు. ఈ ఆదివారం పలువురు అభ్యర్థులు ఓట్ల లెక్కల్లో నిమగ్నమయ్యారు. ఓట్లు ఎక్కడ ఎన్ని పడతాయో ముఖ్య నాయకులతో చర్చిస్తూ అంచనాలు వేసుకోవడం కనిపించింది.   

చేవెళ్ల భాజపా ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి కోల్‌కతాలో పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా.. సికింద్రాబాద్‌ భాజపా ఎంపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి గత కొన్ని రోజులుగా ఉత్తరాది ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. సికింద్రాబాద్‌ కాంగ్రెస్, భారాస అభ్యర్థులు దానం నాగేందర్, పద్మారావు గౌడ్‌ ఇళ్లకే పరిమితమై ఓటింగ్‌ సరళిపై సమీక్షించారు. మల్కాజిగిరి భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక్కడ భారాస, కాంగ్రెస్‌ అభ్యర్థులు కూడా ఇళ్లకే పరిమతమయ్యారు. చేవెళ్ల కాంగ్రెస్, భారాస అభ్యర్థులు ఉదయం నుంచి లెక్కల్లో నిమగ్నమయ్యారు. హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన అసదుద్దీన్‌ ఒవైసీ ఇక్కడ ఎన్నికలైన మరుసటి రోజే ఉత్తర భారతంలో ప్రచారానికి వెళ్లారు. ఇదే నియోజకవర్గం భాజపా అభ్యర్థి మాధవీలత సైతం అక్కడి ప్రచారంలో ఉన్నారు. కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక అభ్యర్థులు ఇళ్లకే పరిమితమయ్యారు.


ముఖ్య నాయకులతో కలిసి అంచనాలు..

త సోమవారం ఎన్నికలు జరిగాయి. జూన్‌ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో  అభ్యర్థులు నియోజకవర్గాలవారీగా ఓట్లశాతాలను అంచనా వేసుకుని ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. నగరంలో తమ పార్టీకి ఉన్న బలంపై భారాస..దేశ వ్యాప్తంగా మోదీకి ఉన్న సానుకూలతపై భాజపా, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా కాంగ్రెస్‌..ఇలా మూడు పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థులు బలాబలాలను బేరీజు వేసుకుంటున్నారు. ముఖ్య నాయకులతో కూర్చొని డివిజన్ల వారీగా అంచనాకు వస్తున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు