logo

వేసవి శిబిరాలు.. సృజనకు సోపానాలు

వేసవి సెలవుల్లో  జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాలకు అనూహ్య స్పందన లభిస్తోంది.

Published : 24 May 2024 02:05 IST

స్కేటింగ్‌లో శిక్షణ పొందుతున్న చిన్నారులు

ఈనాడు డిజిటల్, హైదరాబాద్‌: వేసవి సెలవుల్లో  జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాలకు అనూహ్య స్పందన లభిస్తోంది. దీని పరిధిలోని 366 క్రీడా మైదానాలు, 730 కేంద్రాల్లో 44 క్రీడాంశాలతో శిబిరాలు నిర్వహిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో సత్తాచాటిన 826 మంది మాజీలు, సీనియర్‌ క్రీడాకారులను శిక్షకులుగా ఎంపిక చేశారు. 6-16 ఏళ్ల పిల్లలకు ఉదయం 6-9, సాయంత్రం 3-6 గంటల వరకు శిక్షణ ఇస్తున్నారు.

నామమాత్ర రుసుముతో.. శిబిరాల్లో నామమాత్రపు రుసుముతో చిన్నారులకు తర్ఫీదు ఇస్తున్నారు. అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాక్సింగ్, స్కే మార్షల్‌ ఆర్ట్స్‌తో పాటు చిన్నారుల్లో వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈత వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉండటంతో ఎక్కువ మంది తల్లిదండ్రులు  చిన్నారులకు ఈత నేర్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మాసబ్‌ ట్యాంక్‌ విజయనగర్‌ కాలనీలోని జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్‌ కాంప్లెక్సులోని ఈత కొలనుకి నిత్యం 500 మంది చిన్నారులు వెళ్తున్నారు. ప్రైవేటులో నెలకు రూ.2-3 వేల వరకు వసూలు చేస్తుండటంతో బల్దియా ఆధ్వర్యంలోని ఈత కొలనులను ఆశ్రయిస్తున్నారు. కరాటే శిక్షణ తీసుకుంటున్నవారిలో బాలికలు ఎక్కువగా ఉన్నారు. నెలకు రూ.20తో కరాటే నేర్పుతున్నారు.

కరాటేలో ప్రావీణ్యం సంపాదిస్తూ..

జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో ప్రతిభ

గత 30 ఏళ్లుగా చిన్నారులకు, పెద్దలకు కరాటే శిక్షణ ఇస్తున్నాను. తమ పిల్లలను శారీరకంగా, మానసికంగా దృఢంగా చేయాలని తల్లిదండ్రులు భావిస్తున్నారు. విజయనగర్‌ కాలనీలోని స్పోర్ట్స్‌ కాంప్లెక్సుకు సాధారణ రోజుల్లో 30 మంది చిన్నారులు కరాటే శిక్షణకు వచ్చేవారు. ప్రస్తుతం వారి సంఖ్య 50కి చేరింది. చాలా మంది జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు.

ఎ.ఎం.యాదవ్, జీహెచ్‌ఎంసీ కరాటే కోచ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని