పిల్లల్లోనూ రుమటాలజీ, ఆటో ఇమ్యూన్ సమస్యలు
ఇమ్యూన్ డెఫిషియన్సీ లక్షణాలు: పిల్లల్లో జ్వరాలు రావడం సహజమే. అలా కాకుండా రెండు, మూడు వారాలకంటే ఎక్కవగా జ్వరం రావడం, ఏమైనా ఇన్‌ఫెక్షన్లు సోకడం, అదే పనిగా చెవిలోంచి చీము కారడం, శరీరంలో అక్కడక్కడ చీముగడ్డలు కనిపించడం, కాలేయంలో, బ్రెయిన్, ఊపిరితిత్తుల్లో గడ్డలు కావడం, బరువు పెరగకపోవడం.
రాష్ట్రంలోనే మొదటిసారిగా నిలోఫర్‌లో ఏఎన్‌ఏ, ఇమ్యునో ఫ్లోరోసెస్ పరీక్షలు
సాధారణంగా పెద్దవారిలోనే కీళ్లనొప్పులు వస్తాయనుకుంటాం. కానీ, పిల్లల్లోనూ ఆ సమస్య వస్తుందంటున్నారు నిలోఫర్ ఆసుపత్రి పీడియాట్రిక్ ఫెల్లో ఇన్ ఇమ్యునాలజీ అండ్ రుమటాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.కవిత. అయితే, పిల్లల్లో పీడియాట్రిక్ రుమటాలజీ(కీళ్లనొప్పులు), ‘ఆటో ఇమ్యూన్’ (స్వయం ప్రతిరక్షక) వ్యాధులు ఎందుకు, ఎలా వస్తాయో చెప్పడం కష్టమే.. కొన్ని కుటుంబాల్లో జన్యుపరంగా వచ్చే అవకాశం ఉందంటున్నారు. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు సోకకుండా రోగనిరోధక(ఇమ్యూన్) వ్యవస్థ రక్షిస్తుంది. కొన్నిసార్లు ఈ వ్యవస్థే మన అవయవాలు, కణజాలంపై దాడి చేయడాన్ని ‘ఆటో ఇమ్యూన్’ అంటాము. ముఖ్యంగా పిల్లల్లో ఇమ్యూన్ డెఫిషియన్సీ ఉండటం, ఇమ్యూన్ విధానం సరిగా అభివృద్ధి చెందకపోవడంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ఈ సమస్యతో నిత్యం రెండు మూడు కేసులు వస్తున్నాయని చెబుతున్నారు. మరిన్ని వివరాలు ఆమె మాటల్లోనే..
న్యూస్‌టుడే, రెడ్‌హిల్స్
ఇమ్యూన్ డెఫిషియన్సీ లక్షణాలు: పిల్లల్లో జ్వరాలు రావడం సహజమే. అలా కాకుండా రెండు, మూడు వారాలకంటే ఎక్కవగా జ్వరం రావడం, ఏమైనా ఇన్‌ఫెక్షన్లు సోకడం, అదే పనిగా చెవిలోంచి చీము కారడం, శరీరంలో అక్కడక్కడ చీముగడ్డలు కనిపించడం, కాలేయంలో, బ్రెయిన్, ఊపిరితిత్తుల్లో గడ్డలు కావడం, బరువు పెరగకపోవడం. పిల్లలకు వాక్సిన్‌లు ఇప్పిస్తాం. దానికి ఒకటి, రెండు రోజులు జ్వరం ఉంటుంది. కానీ కొందరికి 15, 20 రోజుల పాటు జ్వరం వస్తూనే ఉంటుంది. అలాంటి పిల్లల్లో ఈ సమస్యపై అనుమానం వ్యక్తం చేయవచ్చు. దగ్గు, జ్వరం ఎక్కువగా రావడం, మందులు వాడాల్సి రావడం వంటి లక్షణాలుంటే ఇమ్యూనో డెఫిషియన్సీ అని గుర్తించి వైద్యులను సంప్రదించాలి.
ఆటో ఇమ్యూన్ లక్షణాలు: పిల్లల్లో ఎదుగుదల బాగానే ఉంటుంది. జ్వరం ఎక్కువగా రెండు, మూడు వారాలు వస్తూనే ఉంటుంది. ఒంటిపై దద్దుర్లు రావడం, బరువు తగ్గడం, వెంట్రుకలు ఊడిపోవడం, నోటిపూత వేధిస్తుంది. ఉదయం వేళ కీళ్లనొప్పులు ఉంటాయి. ఇవి ఎక్కువ రోజులు ఉండటం వంటి లక్షణాలుంటే ‘ఆటో ఇమ్యూన్Â’ సమస్య ఉండవచ్చు. కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. ఇది వరకు దీనికి సరైన చికిత్స లేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో తొలిసారి నిలోఫర్ ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చింది. ఇది వరకు ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం రోగులను నిమ్స్‌కు పంపించేవాళ్లం. కానీ నిలోఫర్‌లోనే జరిగేలా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఉషారాణి అన్ని ఏర్పాట్లు చేశారు.
కిడ్నీ వ్యాధిలా అనిపించినా..
సాధారణంగా పిల్లల్లో కిడ్నీ సమస్యలుంటే నెఫ్రాలాజిస్ట్ చూస్తారు. ఆర్థో ఇమ్యూన్ సమస్యలు కూడా కిడ్నీకి సంబంధించిన వ్యాధిలా బయటపడే అవకాశం ఉంది. రక్తహీనత, గుండె వంటి ఇతరాత్ర సమస్యలుంటాయి. కిడ్నీ సమస్యకైతే 5 నుంచి 7 వారాలు చికిత్స తీసుకుంటే తగ్గిపోయే అవకాశం ఉంది. కానీ, ఆటో ఇమ్యూన్ సమస్య మందులతో తగ్గదు. జీవితాంతం ఉంటుంది. షుగర్, బీపీ తరహాలో జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది.
నిలోఫర్ రెఫరల్ ఆసుపత్రి..
రాష్ట్రంలోని వివిధ జిల్లాలే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి కేసులు వస్తుంటాయి. ప్రతి రోజు ఆటో ఇమ్యూన్, రుమటాలజీకి సంబంధించి ఒకటి, రెండు కేసులు వస్తున్నాయి. వీరికి అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి తెలిపారు. ఈ వ్యాధి నిర్ధారణకు సంబంధించి ఖరీదైన ‘యాంటీన్యూక్లియర్ యాంటీబాడీ టెస్ట్(ఏఎన్‌ఏ)’, ‘ఇమ్యునో ఫ్లోరోసెస్ టెస్ట్’లు మొదటిసారిగా నిలోఫర్ ఆసుపత్రిలో అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఈ సమస్యకు సంబంధించి ఓపీ మాత్రం గురువారం ఉంటుంది. అయితే, ఇన్‌పేషంట్(ఐపీ) కేసులు రోజు చూస్తారు. చికిత్సకు అవసరమైన ఖరీదైన మందులు కూడా నిలోఫర్‌లోనే ఇస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Japan: ప్రధాని ఇంట్లో ప్రైవేటు పార్టీ.. విమర్శలు రావడంతో కుమారుడిపై వేటు!
-
India News
వీసాల్లో మార్పులు.. అండర్ గ్రాడ్యుయేట్లకు కాదు: యూకే మంత్రి
-
Sports News
Yashasvi Jaiswal: మైదానంలో నా ఆలోచనంతా అలానే ఉంటుంది: యశస్వి జైస్వాల్
-
Crime News
Crime News: బాగా చదివి లాయర్ కావాలనుకుని.. ఉన్మాది చేతిలో కత్తి పోట్లకు బలైపోయింది
-
Movies News
Chinmayi: స్టాలిన్ సార్.. వైరముత్తుపై చర్యలు తీసుకోండి: గాయని చిన్మయి
-
Politics News
Congress: ఆ ఒక్క ఎమ్మెల్యే తృణమూల్‌లో చేరిక.. బెంగాల్ అసెంబ్లీలో కాంగ్రెస్ మళ్లీ ఖాళీ!