logo

తండ్రిని హతమార్చిన కుమారుడు

వాగ్వాదం సమయంలో కుమారుడు కొట్టడంతో తండ్రి మృతి చెందిన ఘటన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.

Published : 26 Mar 2023 02:04 IST

బూడిద సుదర్శన్‌

ఉప్పల్‌, న్యూస్‌టుడే: వాగ్వాదం సమయంలో కుమారుడు కొట్టడంతో తండ్రి మృతి చెందిన ఘటన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. రామంతాపూర్‌ వెంకట్‌రెడ్డినగర్‌లో ఉండే బూడిద సుదర్శన్‌(58)కు భార్య గోపమ్మ, ఇద్దరు కుమారులు సాయికుమార్‌, శివకుమార్‌, కుమార్తె స్వప్న ఉన్నారు. కొంతకాలంగా సుదర్శన్‌ మద్యానికి బానిసై, ఏ పనీ చేయడం లేదు. శుక్రవారం  సుదర్శన్‌, భార్య గోపమ్మ, శివకుమార్‌ల మధ్య గొడవ జరిగింది. ఆవేశంతో శివకుమార్‌, గోపమ్మ పైపులతో సుదర్శన్‌పై దాడి చేయడంతో స్పృహ తప్పిపడిపోయాడు. స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సుదర్శన్‌ సోదరుడు పెంటయ్యకు.. మృతుడి ఒంటిపై గాయాలు కనిపించడంతో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో ఈ విషయాలు వెలుగుచూశాయి.


ప్రేమకు అడ్డు చెప్పారని.. ప్రియుడి బలవన్మరణం

దిలీప్‌

షాబాద్‌, న్యూస్‌టుడే: మనస్తాపంతో ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన షాబాద్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో శనివారం జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ గురవయ్యగౌడ్‌ కథనం ప్రకారం.. గోపిగడ్డకు చెందిన రాంజీ కుమారుడు దిలీప్‌(22) డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. తల్లిదండ్రులు మరణించడంతో ఒక్కడే ఉంటున్నాడు. ఓ యువతిని ప్రేమించాడు. ఆమె కుటుంబసభ్యులు వారి ప్రేమకు అడ్డు చెప్పడంతో మనస్తాపంతో  గ్రామ శివారులోని చింతచెట్టుకు డ్రిప్‌ పైపుతో ఉరేసుకున్నాడు. గ్రామస్థులు పోలీసులకు సమాచారమిచ్చారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని