logo

ఫేస్‌బుక్‌లో పరిచయం.. మహిళకు టోకరా

ఫేస్‌బుక్‌ ద్వారా దగ్గరైన ఓ యువకుడు మహిళ వద్ద డబ్బులు తీసుకొని పరారైన సంఘటన జూబ్లీహిల్స్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకొంది. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమబెంగాల్‌కి చెందిన ఓ మహిళ ఏడాదిన్నర క్రితం నగరానికి వచ్చి బ్యూటీపార్లర్‌లో పనిచేస్తుంది.

Updated : 03 Apr 2024 08:35 IST

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: ఫేస్‌బుక్‌ ద్వారా దగ్గరైన ఓ యువకుడు మహిళ వద్ద డబ్బులు తీసుకొని పరారైన సంఘటన జూబ్లీహిల్స్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకొంది. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమబెంగాల్‌కి చెందిన ఓ మహిళ ఏడాదిన్నర క్రితం నగరానికి వచ్చి బ్యూటీపార్లర్‌లో పనిచేస్తుంది. ఆమెకు ఫేస్‌బుక్‌ ద్వారా రవికుమార్‌ పరిచయం అయ్యాడు. పెళ్లి పేరుతో ఆమెకు దగ్గరయ్యాడు. వ్యాపారం నిమిత్తం మహిళ వద్ద రూ. 15లక్షలు అప్పుగా తీసుకున్నాడు. నెలలు గడుస్తున్నా ఇవ్వకపోవడంతో ఆమె డబ్బులు కావాలని కోరింది. అప్పటి నుంచి యువకుడు చరవాణి స్విచ్ఛాఫ్‌ చేసి అందుబాటులో లేకుండా పోయాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా రవిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు