logo

పీహెచ్‌సీ వైద్య సేవలకు నిరీక్షణ

చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రి సిబ్బంది అందుబాటులో ఉండటం లేదు. పేరుకు 24 గంటల ఆసుపత్రి అయినా.. కనీసం పగటిపూట కూడా ఎవరూ ఉండటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Published : 19 May 2024 03:30 IST

వైద్యాధికారి కోసం వేచి చూస్తున్న బాధితులు 

చందుర్తి, న్యూస్‌టుడే: చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రి సిబ్బంది అందుబాటులో ఉండటం లేదు. పేరుకు 24 గంటల ఆసుపత్రి అయినా.. కనీసం పగటిపూట కూడా ఎవరూ ఉండటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చేవారు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని, ప్రతి రోజు ఇదే పరిస్థితి అని వాపోతున్నారు. సిబ్బంది అందుబాటులో లేక గతంలో అంబులెన్స్‌లోనే డెలివరీలు జరిగిన సంఘటనలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. శనివారం సాయంత్రం మల్యాలకు చెందిన బాలుడు కుక్కకాటుకు గురయ్యాడు. ఆసుపత్రికి రాగా కనీసం ప్రథమ చికిత్స చేసేవారే కరవయ్యారని.. బాధితుడు ప్రథమ చికిత్స కోసం గంటకుపైగా వేచి ఉండాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో సరిపడ సిబ్బందిని నియమించి, 24 గంటలు అందుబాటులో ఉండేలా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని