logo

Metro Rail: పైలెట్‌ లేకున్నా.. పట్టాలపై పరుగులు

డ్రైవర్‌ రహిత మెట్రో రైలు సంచారం ఏడాది లోగా ప్రారంభించనున్నారు. అందుకు తగ్గిన ఏర్పాట్లలో బీఎంఆర్‌సీఎల్‌ అధికారులు నిమగ్నమయ్యారు.

Updated : 24 Jul 2023 08:54 IST

పైలెట్‌ రహిత మెట్రో రైలు సిద్ధం

బెంగళూరు (యశ్వంతపుర): డ్రైవర్‌ రహిత మెట్రో రైలు సంచారం ఏడాది లోగా ప్రారంభించనున్నారు. అందుకు తగ్గిన ఏర్పాట్లలో బీఎంఆర్‌సీఎల్‌ అధికారులు నిమగ్నమయ్యారు. అలాంటి రైళ్లు దిల్లీ, ముంబయిలో సంచరిస్తున్నాయి. డ్రైవర్‌ రహిత రైళ్లను బీఈఎంఎల్‌ సిద్ధం చేసి అందించింది. నగరంలో అలాంటి రైళ్ల సంచారానికి ఆరుబోగీలతో కూడిన మెట్రో రైలును సిద్ధం చేయాలని బీఎంఆర్‌సీఎల్‌, బెమల్‌కు సూచించడంతో పాటు ఒప్పందం చేసుకున్నారు. మెట్రో రెండో విడత కారిడార్‌ ఆర్‌వీ రోడ్డు- బొమ్మనహళ్లి మధ్య 18 కిలోమీటర్ల మార్గంలో డ్రైవర్‌ రహిత మెట్రో రైలు సంచారాన్ని ప్రవేశపెట్టాలని తీర్మానించారు. ఆ మార్గంలో 99 శాతం నిర్మాణ పనులను పూర్తి చేశారు. ఏడాది ఆఖరి కల్లా ఆ మార్గంలో డ్రైవర్‌ రహిత మెట్రో రైలు సంచరించే విధంగా పథకాలను సిద్ధం చేశారు. డ్రైవర్‌ రహిత మెట్రో రైలు సంచారం ప్రతిపాదనలో ఉందని, అందుకు సంబంధించిన రైలు బోగీలను కూడా కొనుగోలు చేస్తున్నామని, కొంత సమయం పడుతుందని బీఎంఆర్‌సీఎల్‌ అధికార ప్రతినిధి యశ్వంత్‌ చౌహన్‌ తెలిపారు. ఆ రైలు సంచారం ప్రారంభమైతే కొద్ది రోజులు అటెండర్‌ ఉంటారని, అనంతరం అటెండర్‌ ఉండబోరన్నారు. ఆ మార్గంలో విజయవంతమైతే గులాబీ, ఆకుపచ్చ మార్గాల్లో డ్రైవర్‌ రహిత మెట్రో సంచారాన్ని ప్రారంభించే ఆలోచన ఉందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని