logo

మాజీ పోలీసు అధికారిపై కేసు..!

ఖమ్మం జిల్లా మాజీ పోలీసు ఉన్నతాధికారిపై ఖానాపురం హవేలి ఠాణాలో ఆదివారం కేసు నమోదైనట్లు తెలిసింది.

Published : 22 Apr 2024 01:33 IST

ఖమ్మం నేరవిభాగం: ఖమ్మం జిల్లా మాజీ పోలీసు ఉన్నతాధికారిపై ఖానాపురం హవేలి ఠాణాలో ఆదివారం కేసు నమోదైనట్లు తెలిసింది. లీగల్‌ సమస్యపై హైదరాబాద్‌కు చెందిన ఓమహిళ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఖమ్మం జిల్లాకు చెందిన పలువురి నుంచి ఆమె నగదు తీసుకొని తిరిగి చెల్లించకపోవటంతో సదరు మాజీ పోలీసు అధికారి జోక్యం చేసుకున్నట్లు తెలిసింది. ఈక్రమంలో ఆమెను బెదిరించినట్లు సమాచారం. పోలీసులు ఈ కేసును ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారనే అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని