logo

పునాది దశ దాటని వంతెన

అశ్వాపురం మండలం గొందిగూడెం ఇసుక వాగుపై వంతెన ఈఏడాది వర్షాకాలంలోనూ అందుబాటులోకి రాకపోవచ్చు. పనులు ప్రారంభించి ఏడాది గడిచినా పునాది దశ దాటలేదు.

Published : 21 May 2024 02:45 IST

 

 

అశ్వాపురం, న్యూస్‌టుడే : అశ్వాపురం మండలం గొందిగూడెం ఇసుక వాగుపై వంతెన ఈఏడాది వర్షాకాలంలోనూ అందుబాటులోకి రాకపోవచ్చు. పనులు ప్రారంభించి ఏడాది గడిచినా పునాది దశ దాటలేదు. ఏటా వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో గొందిగూడెం, కొత్తూరు, ఎలకలగూడెం, మనుబోతులగూడెం పంచాయతీలు, ఆవాస ప్రాంతాల ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. వంతెన నిర్మాణానికి గతేడాది మే29న శంకుస్థాపన చేశారు. పునాదుల తవ్వకం పనులు చేపట్టారు. వర్షాలు మొదలవటంతో పనులు నిలిచిపోయాయి. వర్షాకాలం ముగిసి తిరిగి పనులు ప్రారంభమవగానే శాసనసభ ఎన్నికలు వచ్చాయి. తర్వాత ప్రభుత్వం మారింది. ప్రత్యేక నిధులతో చేపట్టిన అనేక పనులను నూతన సర్కారు రద్దు చేసింది. ఎస్‌డీఎఫ్‌ నిధులతో చేపట్టిన ఈ వంతెన నిర్మాణంపై నీలినీడలు అలుముకున్నాయి. తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం తాజా ఆదేశాలు ఈ వంతెన నిర్మాణానికి అడ్డంకి కాబోవని అధికారులు గుర్తించారు. అంతలోపే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ వచ్చింది. రూ.7 కోట్ల అంచనాతో చేపట్టిన వంతెన పనులకు ఇప్పటివరకు రూ.2.50కోట్లు ఖర్చయ్యాయి.ఈ అంశంపై ఆర్‌అండ్‌బీ డీఈ వి.వెంకటేశ్వరరావు స్పందిస్తూ ఎన్నికలు, నిధుల విడుదలలో జాప్యం, తదితరాలతో నిర్మాణ పనుల్లో జాప్యం జరిగిందన్నారు. శీతాకాలంలోగా వంతెన పూర్తవుతుందని తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని