logo

విద్యార్థుల అంతర్గత మార్కుల పరిశీలన

రాజోలి, వడ్డేపల్లి మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో గురువారం 10వ తరగతి విద్యార్థుల అంతర్గత మార్కులను జిల్లా మానిటరింగ్ బృందాలు పరిశీలించాయి.

Updated : 15 Feb 2024 16:35 IST

రాజోలి: రాజోలి, వడ్డేపల్లి మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో గురువారం 10వ తరగతి విద్యార్థుల అంతర్గత మార్కులను జిల్లా మానిటరింగ్ బృందాలు పరిశీలించాయి. జీహెచ్ఎం నిర్మలా జ్యోతి, క్లస్టర్ హెచ్ఎం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలోని రెండు బృందాలు నాలుగు పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించాయి. 20 మార్కులకు సంబంధించి విద్యార్థులు చేసిన ప్రాజెక్టు వర్క్‌లను, స్లిప్ టెస్టులను పరిశీలించి మార్కులకు అనుగుణంగా ఉన్నాయో లేదో చూశారు. ఈనెల 17వ తేదీ వరకు తనిఖీలు కొనసాగుతాయని జీహెచ్ఎం నిర్మల జ్యోతి తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని