logo

షార్‌కు చేరిన ఆర్‌ఐశాట్‌ ఉపగ్రహం

భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌కు గురువారం ఆర్‌ఐశాట్‌-1ఎ ఉపగ్రహం చేరింది. దీన్ని బెంగళూరులోని యూఆర్‌రావు ఉపకేంద్రం నుంచి ప్రత్యేక వాహనంలో కేంద్ర పారిశ్రామిక భద్రత దళాల బందోబస్తు మధ్య షార్‌కు తీసుకొచ్చారు. ఉపగ్రహం ఎత్తుగా ఉండటంతో.

Published : 21 Jan 2022 02:03 IST


ఉపగ్రహాన్ని తీసుకొస్తున్న ప్రత్యేక వాహనం

సూళ్లూరుపేట, న్యూస్‌టుడే: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌కు గురువారం ఆర్‌ఐశాట్‌-1ఎ ఉపగ్రహం చేరింది. దీన్ని బెంగళూరులోని యూఆర్‌రావు ఉపకేంద్రం నుంచి ప్రత్యేక వాహనంలో కేంద్ర పారిశ్రామిక భద్రత దళాల బందోబస్తు మధ్య షార్‌కు తీసుకొచ్చారు. ఉపగ్రహం ఎత్తుగా ఉండటంతో.. రహదారి మార్గంలో తీసుకొచ్చేందుకు పలుచోట్ల ఇబ్బందులు పడ్డారు. నెమ్మదిగా తీసుకురావాల్సి వచ్చింది. బెంగళూరులో బుధవారం ఉదయం బయలుదేరిన వాహనం.. గురువారం సాయంత్రానికి షార్‌కు చేరింది. దీన్ని వచ్చే నెలలో చేపట్టనున్న పొలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌(పీఎస్‌ఎల్‌వీ)-సి52 వాహకనౌక ద్వారా కక్ష్యలోకి పంపనున్నారు.

అర్హత పరీక్ష విజయవంతం

సూళ్లూరుపేట : గగన్‌యాన్‌ ప్రాజెక్టు కోసం తమిళనాడులోని మహేంద్రగిరి ప్రొపెల్షన్‌ కాంప్లెక్సు (ఐపీఆర్‌సీ)లో గురువారం నిర్వహించిన హైథ్రస్ట్‌ వికాస్‌ ఇంజిన్‌ అర్హత పరీక్ష విజయవంతమైంది. ఇంజిన్‌కు 25 సెకన్లపాటు దీన్ని నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని