logo

మద్యం తాగి పాఠశాలకు వచ్చిన హెచ్ఎం.. నడవలేక నేలపై దొర్లుతూ..

ఆయన విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ప్రధానోపాధ్యాయుడు. మద్యం మత్తులో నడవలేని స్థితిలో తరగతి గది ముందు నేలపై దొర్లుతున్న దృశ్యం చర్చనీయాంశమైంది.

Updated : 29 Sep 2023 08:59 IST

పాఠశాల ఆవరణలో నేలపై పడి ఉన్న ప్రధాన ఉపాధ్యాయుడ్ని చూస్తున్న విద్యార్థులు

కటక్‌, న్యూస్‌టుడే: ఆయన విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ప్రధానోపాధ్యాయుడు. మద్యం మత్తులో నడవలేని స్థితిలో తరగతి గది ముందు నేలపై దొర్లుతున్న దృశ్యం చర్చనీయాంశమైంది. కేంఝర్‌ జిల్లా హరిచందన్‌పూర్‌ సమితిలో ఉన్న గరదాహాబహాలోని ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఈ దృశ్యం కనిపించింది. ఒకటి నుంచి 5వ తరగతి వరకు ఇక్కడ విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు వసంత ముండతోపాటు మరో ఉపాధ్యాయుడు పనిచేస్తున్నారు. బుధవారం తప్ప తాగి ప్రధానోపాధ్యాయుడు పాఠశాలకు వచ్చారు. కనీసం తరగతి గదిలోకి కూడా వెళ్లలేక నేలపై పడిపోయి దొర్లడం ప్రారంభించారు. దీంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారంతా వచ్చి ఆయనకు సపర్యలు చేశారు. కొందరు ఈ మొత్తం వ్యవహారాన్ని చరవాణిలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్‌ అయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని