logo

చెప్పాపెట్టకుండా రైల్వేగేటు గంటపాటు మూత

ఎలమంచిలిలో సోమవారం కొక్కిరాపల్లి రైల్వేగేటు గంటపాటు మూసివేయడంతో ప్రయాణికులు పడరాని పాట్లు పడ్డారు.

Updated : 20 Feb 2024 09:29 IST

ఎలమంచిలి రైల్వేగేటు వద్ద భారీగా నిలిచిన వాహనాలు

ఎలమంచిలి, న్యూస్‌టుడే: ఎలమంచిలిలో సోమవారం కొక్కిరాపల్లి రైల్వేగేటు గంటపాటు మూసివేయడంతో ప్రయాణికులు పడరాని పాట్లు పడ్డారు. వరుసగా ఐదు రైళ్లు రాకపోకలు సాగించే వరకూ గేటు తెరవలేదు. ఒక దాని వెంట మరో రైలు వచ్చాయి. ఈ కారణంగా ఎక్కువ సమయం గేటు వద్ద వాహనాలు నిలిచిపోయాయి. గేటు తెరిచాక ఒక్కసారిగా రెండువైపులా వాహనాలు రావడంతో ట్రాఫిక్‌ ఆగిపోయింది. ఇందులో తొమ్మిది ఆర్టీసీ బస్సులు చిక్కుకోవడంతో ప్రయాణికులు ఇక్కట్లు పడ్డారు.

ఏటికొప్పాకలో మూడు రోజుల పాటు..

ఎలమంచిలి గ్రామీణం, న్యూస్‌టుడే: ఎలమంచిలి నుంచి ఏటికొప్పాక వెళ్లే మార్గంలో ఉన్న రైల్వేగేటు మూడు రోజుల పాటు మూసి వేస్తున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రైల్వేట్రాక్‌ మరమ్మతుల కారణంగా ఈ నెల 19, 20, 21 తేదీల్లో గేటు పనులు జరుగుతాయన్నారు. వాహనదారులు ఈ విషయాన్ని గ్రహించి, సహకరించాలని తెలిపారు. సమాచారం తెలియక పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బంది పడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని