logo

సీఎం గారూ... మీ ఇళ్లు ఇలాగే కట్టారా?

జగనన్న కాలనీల పేరిట వేలాది ఇళ్లు నిర్మించి పేదలకు ఇస్తామని లేనిపోని హామీలు గుప్పించిన సీఎం జగన్‌ పాలకు ఐదేళ్లయింది.

Updated : 24 Apr 2024 05:06 IST

సబ్బవరం మండలం పైడివాడలో జగనన్న లేఅవుట్‌లో నిర్మాణం తీరిది

జగనన్న కాలనీల పేరిట వేలాది ఇళ్లు నిర్మించి పేదలకు ఇస్తామని లేనిపోని హామీలు గుప్పించిన సీఎం జగన్‌ పాలకు ఐదేళ్లయింది. అయినా గృహాలను పూర్తి చేయలేకపోయిన ముఖ్యమంత్రి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణ పేదల కోసం సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం వద్ద వేసిన లేఅవుట్‌లో గట్టి పునాదులు లేకుండానే పనులు ఆరంభించారు. భూమి మీద పైపైనే కాంక్రీట్‌ బెల్ట్‌ వేసి వదిలేశారు. ‘హైదరాబాద్‌, తాడేపల్లి, ఇడుపులపాయలో మీ ఇళ్లను ఇలాగే నిర్మించారా జగనన్నా... ఒక్కసారి ఆలోచించన్నా’ అంటూ లబ్ధిదారులు  ప్రశ్నిస్తున్నారు.

  ఈనాడు, విశాఖపట్నం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని