logo

దిల్లీ X కోల్‌కతా.. ఎవరిదో పైచేయి..!

ఐపీఎల్‌-2024లో భాగంగా ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియంలో బుధవారం దిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్లు తలపడనున్నాయి. గతనెల 31న జరిగిన మ్యాచ్‌లో చెన్నైపై విజయం సాధించిన దిల్లీ ఆత్మవిశ్వాసంతో బరిలో దిగుతుండగా, కోల్‌కతా ఎలాగైనా గెలిచేందుకు సర్వశక్తులను ఒడ్డనుంది.

Updated : 03 Apr 2024 04:22 IST

దిల్లీ ఆటగాళ్లు; పిచ్‌ను పరిశీలిస్తున్న సౌరభ్‌ గంగూలీ

విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే: ఐపీఎల్‌-2024లో భాగంగా ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియంలో బుధవారం దిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్లు తలపడనున్నాయి. గతనెల 31న జరిగిన మ్యాచ్‌లో చెన్నైపై విజయం సాధించిన దిల్లీ ఆత్మవిశ్వాసంతో బరిలో దిగుతుండగా, కోల్‌కతా ఎలాగైనా గెలిచేందుకు సర్వశక్తులను ఒడ్డనుంది. మంగళవారం ఆ జట్టు ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌తో పాటు మనీష్‌పాండే, రింకూసింగ్‌, రసెల్‌, మిచెల్‌ స్టార్క్‌, లోకల్‌ బాయ్‌ కె.ఎస్‌.భరత్‌ రాణించాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. దిల్లీ క్యాపిటల్స్‌ జట్టులో నాయకుడు రిషబ్‌పంత్‌, డేవిడ్‌ వార్నర్‌, పృథ్విషా, అక్షర్‌పటేల్‌ ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. చెన్నై మ్యాచ్‌కు స్టేడియం కిక్కిరిసి పోగా, టికెట్లు దొరక్క అభిమానులు నిరుత్సాహ పడ్డారు. బుధవారం నాటి మ్యాచ్‌ టికెట్లకు ఆ స్థాయిలో డిమాండ్‌ లేకపోవడం గమనార్హం.

నేడు నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే : మ్యాచ్‌ సందర్భంగా స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. మ్యాచ్‌ రాత్రి 7 నుంచి 11.30 గంటల వరకు జరుగనుంది. దీంతో నగరంలో పలు చోట్ల వాహనాలను దారి మళ్లించే ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని