logo

గ్రూపు-1 పరీక్షకు 14 పరీక్ష కేంద్రాలు

జిల్లాలో జూన్‌ 9న జరగనున్న గ్రూపు-1 ప్రాథమిక పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా తెలిపారు.

Published : 19 May 2024 04:15 IST

దృశ్యమాధ్యమ సమీక్షలో పాల్గొన్న కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా, అదనపు కలెక్టర్‌ పింకేశ్‌కుమార్‌  

జనగామ అర్బన్, న్యూస్‌టుడే: జిల్లాలో జూన్‌ 9న జరగనున్న గ్రూపు-1 ప్రాథమిక పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా తెలిపారు. శనివారం హైదరాబాద్‌ నుంచి టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ మహేందర్‌రెడ్డి గ్రూపు-1 ప్రాథమిక పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్‌ నుంచి అదనపు కలెక్టర్‌ పింకేశ్‌కుమార్, ఏసీపీ అంకిత్‌కుమార్, సంబంధిత శాఖల అధికారులతో కలిసి కలెక్టర్‌ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 3,697 మంది పరీక్ష రాయనున్న నేపథ్యంలో 14 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు సీసీ కెమెరాల ఏర్పాటు, కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఆర్డీవో కొమురయ్య, జడ్పీ సీఈవో అనీల్‌కుమార్, రీజినల్‌ కోఆర్డినేటర్‌ నర్సయ్య, డీఈవో రాము, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పెండింగ్‌ దరఖాస్తులను పరిష్కరించండి

జనగామ అర్బన్‌: ప్రజావాణి, ధరణి పెండింగ్‌ దరఖాస్తులను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో ధరణి, ప్రజావాణి, మీసేవ పెండింగ్‌ దరఖాస్తులపై అధికారులతో సమీక్షించారు. దరఖాస్తుల ప్రక్రియ వేగవంతం చేయాలని, మీసేవ పెండింగ్‌ దరఖాస్తులను త్వరగా పూర్తి చేసి నివేదికను సమర్పించాలని తెలిపారు. సమావేశంలో ఆర్డీవోలు కొమురయ్య, వెంకన్న, ఈడీఎం దుర్గారావు, అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని