logo

‘విద్యావంతుడైన రాకేశ్‌రెడ్డిని గెలిపించుకుందాం’

Published : 20 May 2024 02:46 IST

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ 

హనుమకొండ చౌరస్తా, న్యూస్‌టుడే : నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉన్నత విద్యావంతుడైన భారాస ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుందామని మాజీ ఎంపీ, కరీంనగర్‌ భారాస ఎంపీ అభ్యర్థి బి.వినోద్‌కుమార్‌ అన్నారు. హనుమకొండ కాకతీయ కాలనీలోని ఆయన నివాసంలో ఆదివారం పట్టభద్రుల సన్నాహక సమావేశం నిర్వహించారు. న్యాయవాదులు, కేయూ విద్యార్థి నాయకులు, పరిశోధకులు, సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు. సమావేశంలో వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ పట్టభద్రుల సమస్యలపై ప్రశ్నించే గొంతుకగా రాకేశ్‌రెడ్డిని ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వరంగల్‌ ఎంపీ అభ్యర్థి సుధీర్‌కుమార్, నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, న్యాయవాదులు సహోదర్‌రెడ్డి, గణేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని