logo

పార్లమెంట్‌కు 2, అసెంబ్లీకి 6

జిల్లాలో రెండో రోజు శుక్రవారం నామపత్రాల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి జాతీయ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా కావూరి లావణ్య, స్వతంత్ర అభ్యర్థిగా బొకినాల కోటేశ్వరరావు నామపత్రాలను సమర్పించారు.

Published : 20 Apr 2024 05:55 IST

రెండో రోజు 8 నామినేషన్లు దాఖలు

ఏలూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో రెండో రోజు శుక్రవారం నామపత్రాల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి జాతీయ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా కావూరి లావణ్య, స్వతంత్ర అభ్యర్థిగా బొకినాల కోటేశ్వరరావు నామపత్రాలను సమర్పించారు. ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున పత్సమట్ల ధర్మరాజు, దెందులూరు నుంచి వైకాపా అభ్యర్థిగా కొఠారు అబ్బయ్య చౌదరి, నూజివీడు నుంచి వైకాపా తరఫున మేకా వెంకట ప్రతాప అప్పారావు, కైకలూరు నుంచి జాతీయ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బొడ్డు నోబుల్‌తో పాటు బొడ్డు జీవన్‌ డానియేల్‌ నోబుల్‌, జై భీమ్‌ పార్టీ తరఫున గొంతుపులుగు సతీశ్‌ కుమార్‌ నామపత్రాలు దాఖలు చేశారు. ఏలూరు, చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లో నామపత్రాలు దాఖలు కాలేదు.

మొత్తం 15 .. జిల్లాలో నామపత్రాల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. తొలిరోజు ఏడుగురు దాఖలు చేయగా.. రెండో రోజు ఎనిమిది 8 మంది సమర్పించారు. రెండు రోజుల్లో మొత్తం 15  దాఖలయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని