logo

అరాచకాలే తప్ప అభివృద్ధి ఏదీ ?

వైకాపా ప్రభుత్వం పాదయాత్రల్లో అనేక హామీలు ఇచ్చి వాటిని గాలికి వదిలేసి, నేడు ప్రజలను హింసించడమే పనిగా పెట్టుకుందని మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి విమర్శించారు.

Published : 28 Mar 2023 05:07 IST

తెదేపా నేతలు ఈశ్వరి, శ్రావణ్‌

భీమవరం ఇదేం ఖర్మ కార్యక్రమంలో తెదేపా నాయకులు

కొయ్యూరు, హుకుంపేట, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం పాదయాత్రల్లో అనేక హామీలు ఇచ్చి వాటిని గాలికి వదిలేసి, నేడు ప్రజలను హింసించడమే పనిగా పెట్టుకుందని మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి విమర్శించారు. కొయ్యూరు మండలం కిలపర్తి, హుకుంపేట మండలం భీమవరం, సూకూరు పంచాయతీలోని పలు గ్రామాల్లో సోమవారం ‘ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎక్కడ చూసినా అరాచకాలే తప్ప అభివృద్ధి ఎక్కడా కనిపించటం లేదని పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం అసమర్థ పాలన మూలంగా అభివృద్ధి శూన్యంగా మారిందన్నారు. గిరిజన ప్రాంతాల్లో చట్టాలను, జీఓలను తుంగలో తొక్కి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా అధికారంలోకి వచ్చాక గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేస్తుందని పేర్కొన్నారు. నాయకులు సుబ్బారావు, వాసుదేవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని