logo

వైకాపా పాలనపైౖ తిరుగుబాటు మొదలైంది!

వైకాపా పాలనపై ప్రజల నుంచి తిరుగుబాటు మొదలైందని మాజీ మంత్రి శ్రావణ్‌కుమార్‌ అన్నారు. మండలంలోని ఎగువశోభ పంచాయతీ దిగువశోభ గ్రామంలో మంగళవారం నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Published : 29 Mar 2023 02:22 IST

మాజీ మంత్రి శ్రావణ్‌

దిగువశోభ గ్రామంలో తెదేపా నేతల ర్యాలీ

అనంతగిరి, న్యూస్‌టుడే: వైకాపా పాలనపై ప్రజల నుంచి తిరుగుబాటు మొదలైందని మాజీ మంత్రి శ్రావణ్‌కుమార్‌ అన్నారు. మండలంలోని ఎగువశోభ పంచాయతీ దిగువశోభ గ్రామంలో మంగళవారం నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.  తెదేపా నాయకులు గ్రామంలో ర్యాలీ కార్యక్రమం చేపట్టారు. శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రజలు వైకాపాకు తగిన గుణపాఠం చెబుతారన్నారు. సంక్షేమ పథకాల పేరిట కొద్ది మొత్తం ఇచ్చి, నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్ని అంటేలా చేసి సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్నారని ఆరోపించారు. నేతలు ఆనంద్‌, జోగులు, శ్యామ్‌, దయానిధి, నరేంద్ర, కొండమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని