logo

విద్యా వ్యవస్థ నిర్వీర్యం

ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, పేద, బడుగు వర్గాల విద్యార్థులకు విద్యను దూరం చేసే కుట్రలో భాగంగా పాఠశాలల విలీనం ప్రక్రియను తెరపైకి తీసుకొచ్చిందని ఏపీటీఎఫ్‌ నేతలు ధ్వజమెత్తారు.

Published : 13 Jul 2022 04:06 IST

ఏపీటీఎఫ్‌ నేతల ధ్వజం


కలెక్టరేట్‌ ఎదుట ఏపీటీఎఫ్‌ నాయకుల ఆందోళన

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, పేద, బడుగు వర్గాల విద్యార్థులకు విద్యను దూరం చేసే కుట్రలో భాగంగా పాఠశాలల విలీనం ప్రక్రియను తెరపైకి తీసుకొచ్చిందని ఏపీటీఎఫ్‌ నేతలు ధ్వజమెత్తారు. వంద రోజుల ఉద్యమంలో భాగంగా మంగళవారం ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి నరసింహులు మాట్లాడుతూ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం కాదు కదా.. అంతో ఇంతో ఉన్న ప్రమాణాలు దిగజారే విధంగా పలు సంస్కరణలు ప్రవేశ పెట్టిందన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకుండా మొండి వైఖరి అవలంబిస్తోందన్నారు. ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాయల్‌ వెంకటేష్‌, సిరాజుద్దీన్‌, సహా ప్రధాన కార్యదర్శి హనుమప్ప, సహాధ్యక్షుడు రామానాయక్‌ తదితరులు మాట్లాడుతూ 117 ఉత్తర్వు ఆధారంగా పాఠశాలల విలీనం చేపట్టడం విడ్డూరమన్నారు. సీపీఎస్‌ను సత్వరమే రద్దు చేయాలన్నారు. ప్రాథమిక పాఠశాలలోని 3,4,5వ తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం తగదన్నారు. ఆ తర్వాత డిమాండ్లతో కూడిన వినతిని డీఆర్‌ఓ గాయత్రీదేవికి అందజేశారు. నిరసనలో ఏపీటీఎఫ్‌ నాయకులు గాయత్రి, అంజలి, భాస్కర్‌, రమణ, సతీష్‌, ఓబిలేసు, సర్దార్‌వలి, ధనుంజయ, పూర్ణచంద్రరావు, ఈశ్వరయ్య, ఆనంద్‌, వన్నప్ప, విశ్వనాథ్‌, శ్రీనివాసులు, కదిరప్ప, ఎల్లప్ప, హనుమంతు, నజీర్‌, దాదా, ఓబన్న తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని