logo

Property purchase: ప్లాట్లు, ఇళ్లు అమ్మకానికి పెడితే.. ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే!

Eenadu icon
By Telangana Dist. Team Updated : 13 Nov 2024 09:21 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

అనుమతులు రాకుండానే బేరసారాలు
హెచ్‌ఎండీఏ, డీటీసీపీ పేరుతో దందా

ఈనాడు, హైదరాబాద్‌: ‘శివారులో మంచి లేఅవుట్‌ ఉంది.. హెచ్‌ఎండీఏ లేదా డీటీసీపీ అనుమతులు తీసుకున్నాం. తక్కువ ధరకే ఇస్తున్నాం..’ అని ఎవరైనా ప్లాట్లు లేదా ఇళ్లు అమ్మకానికి పెడితే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని ముందుకెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. లేఅవుట్‌ లేదా భవనాల నిర్మాణాలకు హెచ్‌ఎండీఏ, డీటీసీపీలకు దరఖాస్తు చేసుకొని ఇంకా అనుమతులు రాకముందే అందులో ప్లాట్లు, ఇళ్లను కొందరు అమ్మకానికి పెడుతున్నారు. ముఖ్యంగా శంషాబాద్, మేడ్చల్, శంకర్‌పల్లి జోన్లలో ఈ దందా ఎక్కువగా నడుస్తోంది. 

రంగారెడ్డి జిల్లా కొందుర్గులో 421 ఎకరాల్లో లేఅవుట్‌ ఉందని, డీటీసీపీ అనుమతులు కూడా తీసుకున్నట్లు అవతలి వ్యక్తులు చెప్పడంతో గుడ్డిగా నమ్మిన ఓ వ్యక్తి వారికి దాదాపు రూ.30 లక్షలపైనే సమర్పించుకున్నాడు. విషయం తెలిసి లబోదిబోమంటూ ఇటీవల  పోలీసులను ఆశ్రయించారు. 

ఇవి గమనించండి..

  • హెచ్‌ఎండీఏ పరిధిలోని లేఅవుట్లకు, అయిదు అంతస్తులు అంతకుమించిన భవనాలకు హెచ్‌ఎండీఏ, జిల్లాల్లో డీటీసీపీ నుంచి అనుమతులు తీసుకోవాలి. హెచ్‌ఎండీఏ నుంచి ఎల్‌పీ నంబరు, డీటీసీపీ సంబంధించి  అనుమతుల వివరాలు క్షుణ్ణంగాపరిశీలించి ముందుకు వెళ్లాలి.
  • ముఖ్యంగా లేఅవుట్లలో ప్లాట్లు కొనేముందే భూ యజమాని పూర్తి వివరాలు, లింకు డాక్యుమెంట్లు తప్పకుండా పరిశీలించాలి. మార్టిగేజ్‌ ప్లాట్లను అంటగట్టడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు. తక్కువకే ఇస్తామని చెబుతుంటారు. మార్టిగేజ్‌లో ఉన్న ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ చేయడం కుదరదు సరికదా.. అందులో నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వరని గ్రహించాలి.
  • కోర్టు కేసులు, ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లలో ఉన్న ప్లాట్లు, ఇళ్లు ఎంత తక్కువకు విక్రయించాలని చూసినా సరే...వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది. లేఅవుట్‌ వేసిన తర్వాత అందులో మౌలికవసతుల కల్పన, మార్టిగేజ్‌ ప్లాట్లు ఉన్నాయా అనే వివరాలు తెలుసుకోవాలి.
Tags :
Published : 13 Nov 2024 09:11 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని