logo

Hyderabad: చికెన్‌ వ్యర్థాల పోరు.. హైకోర్టులో కేసులు

Eenadu icon
By Telangana Dist. Team Updated : 07 Dec 2024 09:36 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

బల్దియా ఆదేశాలతో నష్టపోతామంటోన్న వ్యాపారులు

ఈనాడు, హైదరాబాద్‌: చెత్తలో కలిసిపోయే చికెన్‌ ముక్కలకు హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ(GHMC), చికెన్‌ దుకాణాల యాజమాన్యాలు, వ్యర్థాల నిర్వహణ కేంద్రాల మధ్య తీవ్రమైన పోరు నడుస్తోంది. మూడేళ్ల క్రితం మొదలైన అలజడి.. ఇటీవల పోలీసు కేసులు, కోర్టు కేసుల వరకు వెళ్లింది. వ్యాపారులను నష్టపరిచే విధానాలేంటని కోళ్ల మాంసం వ్యాపారులు బల్దియాపై హైకోర్టుకు వెళ్లారు. (Hyderabad News)

జంతు వ్యర్థాలకు పోటీ.. కోడి, మేక, గొర్రె, పశు మాంసం విక్రయ కేంద్రాలు నగరంలో పెద్ద సంఖ్యలో ఉన్నాయి. గొర్రె, మేకలు, పొటేళ్ల మాంసంలో.. దాదాపు 98శాతం వంట గదికి తరలుతోంది. తినేందుకు పనికిరాని రెండు శాతంలో.. చర్మం, కాళ్ల గిట్టలు, కొమ్ములు ఉంటాయని, వాటిని కూడా వేర్వేరుగా  వ్యాపారులు కొనుగోలు చేస్తారని అధికారులు చెబుతున్నారు.

దుకాణదారులు ఏమంటున్నారంటే..

‘‘సొంతంగా డబ్బు పెట్టి వ్యాపారం చేసుకునేది మేము. మా దగ్గర ఉత్పత్తయ్యే వ్యర్థాలకు ఎవరు ఎక్కువ ధర ఇస్తే.. వాళ్లకే వాటిని అమ్ముతాం. జీహెచ్‌ఎంసీ ఈ విషయంలో మమ్మల్ని వేధిస్తోంది.

బల్దియా ఏం చెబుతుందంటే..

శాస్త్రీయ పద్ధతిలో వ్యర్థాలను నిర్వహిస్తామంటూ బల్దియాతో ఒప్పందం చేసుకున్న సంస్థకే మాంసం దుకాణాలు వ్యర్థాలను ఇవ్వాలి.

వాస్తవం ఎలా ఉందంటే..

నగరంలో రోజూ 500 టన్నులకుపైగా జంతు వ్యర్థాలు ఉత్పత్తవుతున్నాయి. దాన్ని ప్రైవేటు వ్యక్తులు ప్రొటీన్‌ పౌడరుగా మార్చి ఆంధ్రప్రదేశ్‌లోని చేపలు, రొయ్యల చెరువులకు అమ్ముతుంటారు.

ఇక్కడే వివాదం..

  • కోడి, జంతు మాంసం, ఇతరత్రా జంతు వ్యర్థాలను అధిక ఉష్ణోగ్రత వద్ద నీటిలో మరిగించి, దాన్ని చాక్లెట్‌ పొడి లాంటి ప్రోటీన్‌ పౌడరుగా తయారు చేసే సంస్థలు నగరంలో పెరిగాయి. మాంసం దుకాణాల్లోని చెత్తనే వాటికి ముడి సరకు. కోడి మాంసం దుకాణాలతో ముందస్తు ఒప్పందం చేసుకుని.. రోజూ అక్కడ ఉత్పత్తయ్యే చెత్తను తీసుకెళ్తున్నాయి.
  • మూడేళ్ల క్రితం చెంగిచెర్లలోని రెండరింగ్‌ ప్లాంట్‌తో జీహెచ్‌ఎంసీ ఒప్పందం చేసుకుంది. నగరంలో ఉత్పత్తయ్యే జంతు వ్యర్థాలను సేకరించుకుని, వాటిని శాస్త్రీయపద్ధతిలో(స్టీలు తయారు చేసిన ట్రాలీ కలిగిన ట్రక్కుల్లో సేకరించి, బాయిలర్లలో వేసే వరకు.. శీతల కంటైనరులో భద్రపరిచి, ప్రొటీన్‌ పౌడరుగా తయారు చేయడం) నిర్వహించాలన్నది నిబంధన. ఈ ఒప్పందమే నగరంలో వివాదాన్ని సృష్టించింది.
Tags :
Published : 07 Dec 2024 09:35 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని