logo

MLC Kavitha: స్వర్ణకారులపై వేధింపులు మానుకోవాలి: ఎమ్మెల్సీ కవిత

Eenadu icon
By Telangana Dist. Team Published : 07 Jul 2025 11:38 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: తెలంగాణలో ఇటీవల వరుసగా జరుగుతున్న స్వర్ణకారుల ఆత్మహత్యలు కలచివేస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత (Kavitha) అన్నారు. స్వర్ణకారులపై వేధింపులు మానుకోవాలని హెచ్చరించారు. కేసులకు భయపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని హితవు పలికారు. బంగారం వృత్తి చేసుకునే వారికి సర్కారు రుణాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్పొరేట్ సంస్థలతో పోటీ పడేలా విశ్వకర్మలకు చేయూతనివ్వాలని కవిత కోరారు. నిజామాబాద్ ఎంపీగా ఉన్న సమయంలో స్వర్ణకారులను పోలీసులు ఇబ్బంది పెట్టకుండా చర్యలు తీసుకున్నట్లు ఆమె గుర్తు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు