logo

GHMC: హైదరాబాద్‌ నగర శుభ్రతకు ‘జెటాయు’!

Eenadu icon
By Telangana Dist. Desk Updated : 17 Jan 2025 07:24 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఖైరతాబాద్, న్యూస్‌టుడే: పారిశుద్ధ్య నిర్వహణలో ఆధునిక సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటున్న జీహెచ్‌ఎంసీ కుప్పలుగా ఉన్న చెత్తను తొలగించి ట్యాంక్‌లో స్టోర్‌ చేసే కొత్త యంత్రాలను వినియోగించేందుకు సిద్ధమవుతోంది. ముంబయి, చెన్నైలలో ఇప్పటికే వినియోగంలో ఉన్న ఈ యంత్రాలు కార్మికులు ఊడ్చిన చెత్తను వాహనమే పైపు ద్వారా పీల్చుకుని ట్యాంక్‌లో స్టోర్‌ చేసుకుంటుంది. ఈ యంత్రం వల్ల పని వేగంగా పూర్తవ్వడంతో పాటు, అతి చిన్న వ్యర్థాలను తొలగించే అవకాశం ఉంటుంది. మెక్లీన్‌ సంస్థ ఈ యంత్రాన్ని నగరానికి తీసుకొచ్చి గురువారం మింట్‌కాంపౌండ్, ఖైరతాబాద్‌ ప్రాంతాల్లో యంత్రం పనితీరుని అధికారులకు చూపించారు. జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య అదనపు కమిషనర్‌ రఘుప్రసాద్, ఖైరతాబాద్‌ ఉప కమిషనర్‌ రజినీకాంత్‌రెడ్డి, ఏఎంఓహెచ్‌ చంద్రశేఖర్‌ తదితరులు పరిశీలించారు. యంత్రం వినియోగంలోకి తెచ్చేందుకు దాదాపు రూ.50లక్షల ఖర్చువుతుందని అధికారులు తెలిపారు. దీంతో మరోసారి పనితీరు పరిశీలించే అవకాశం ఉంది. (GHMC)

ప్రత్యేకతలు ఇవే..

  • చెత్తను ట్యాంక్‌లోకి లాక్కునేందుకు 8 ఎంఎం డయా పరిమాణంలో ఉండే పైపు 7 అంగులాల పరిమాణంలో గల ఎలాంటి వస్తువునైనా లాక్కుంటుంది.
  • రాళ్లు, కొబ్బరి బోండాం వంటి వాటినీ పైపు నుంచి పీల్చేసుకుంటుంది.
  • యంత్రం ట్యాంక్‌ పరిమాణం దాదాపు 2.2 టన్నులు ఉంటుంది.
  • ట్యాంక్‌ నిండాక డంపింగ్‌ యార్డుకు తీసుకెళ్లి అన్‌లోడ్‌ చేస్తారు.  
Tags :
Published : 17 Jan 2025 07:22 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని