logo

‘రాష్ట్రంలో అందరి చూపు తెదేపా వైపే’

ఉమ్మడి ఏపీలో చంద్రబాబునాయుడు నాటిన ఐటీ విత్తనం నేటి తెలంగాణలో మహావృక్షంగా ఎదిగిందని, వాటి ఫలాలు ప్రస్తుతం యువతకు దక్కుతుండడంతో మళ్లీ తెదేపా అధికారంలోకి.

Published : 27 Mar 2023 01:32 IST

ప్రసంగిస్తున్న అరవింద్‌కుమార్‌గౌడ్‌, చిత్రంలో కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌, అలీ మస్కతి

అబిడ్స్‌, న్యూస్‌టుడే: ఉమ్మడి ఏపీలో చంద్రబాబునాయుడు నాటిన ఐటీ విత్తనం నేటి తెలంగాణలో మహావృక్షంగా ఎదిగిందని, వాటి ఫలాలు ప్రస్తుతం యువతకు దక్కుతుండడంతో మళ్లీ తెదేపా అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ అన్నారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎం.అరవింద్‌కుమార్‌గౌడ్‌, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కాట్రగడ్డ ప్రసూన, షఖీలారెడ్డి, అలీ మస్కతి, అట్లూరి సుబ్బారావు, డా.ఏఎస్‌రావు తదితరులతో కలిసి ఎగ్జిబిషన్‌ మైదానంలో ఏర్పాట్లను ఆదివారం సాయంత్రం పరిశీలించి మాట్లాడారు. తెదేపా 41వ ఆవిర్భావ, ప్రతినిధుల సభను ఈనెల 29న నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ మైదానంలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని