logo

తాండూరు అభివృద్ధి పట్టని భారాస: భాజపా

తాండూరు మున్సిపాలిటీలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం స్థానిక భాజపా నాయకులు అంబేడ్కర్‌ కూడలిలో ఒక రోజు నిరసన దీక్ష నిర్వహించారు.

Published : 28 Mar 2023 02:57 IST

దీక్షలో పాల్గొన్న మురళీకృష్ణ గౌడ్‌, రమేష్‌ తదితరులు

తాండూరు, తాండూరు టౌన్‌, న్యూస్‌టుడే: తాండూరు మున్సిపాలిటీలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం స్థానిక భాజపా నాయకులు అంబేడ్కర్‌ కూడలిలో ఒక రోజు నిరసన దీక్ష నిర్వహించారు. తాండూరు అభివృద్ధి విషయంలో భారాస నాయకుల మాటలు కోటలు దాటుతున్నా అభివృద్ధి మాత్రం ఆమడ దూరంలో ఉందని విమర్శించారు. ప్రజా సమస్యలను చర్చించడానికి మున్సిపల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. తాండూరులో దేవుడు ఒక్కడు.. పూజారులు ఇద్దరు అన్న చందంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పట్టణ సమస్యలు పరిష్కరించకుంటే ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. ఏళ్ల నుంచి శాశ్వత కమిషనరు లేక పోవటంతో అనేక సమస్యలు పేరుకు పోయాయన్నారు. పురపాలికలో వివిధ భాగాల్లోని ఖాళీలను భర్తీ చేయాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించాలన్నారు. ట్రాఫిక్‌ సిగ్నళ్లను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర భాజపా కార్యవర్గ సభ్యుడు మురళీ కృష్ణగౌడ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్‌ కుమార్‌, కార్యదర్శి భద్రేశ్వర్‌, తాండూరు పట్టణ అధ్యక్షుడు సుదర్శన్‌ గౌడ్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు శ్రీలత, లావణ్య, నాయకులు మనోహర్‌రావు, పూజారి పాండు, మోత్కుపల్లి చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని