logo

గ్రామాలకు బస్సులు తిరగక ఇక్కట్లు

వికారాబాద్‌ మండలంలో అనేక గ్రామాలకు ఆర్టీసీ బస్సులను నడపటం లేదని, వెంటనే బస్సులు నడపాలని తెలంగాణ ఆడపిల్లల సమానత్వ సమాఖ్య (టాస్‌) జిల్లా అధ్యక్షురాలు జ్యోతి, ప్రతినిధులు సానియా, ఎంవీ ఫౌండేషన్‌ సిబ్బంది శ్రీనివాస్, వెంకటయ్య అన్నారు.

Published : 28 May 2024 02:45 IST

కలెక్టర్‌ నారాయణ రెడ్డికి వినతి పత్రం అందజేస్తున్న జ్యోతి  

వికారాబాద్‌ కలెక్టరేట్, న్యూస్‌టుడే: వికారాబాద్‌ మండలంలో అనేక గ్రామాలకు ఆర్టీసీ బస్సులను నడపటం లేదని, వెంటనే బస్సులు నడపాలని తెలంగాణ ఆడపిల్లల సమానత్వ సమాఖ్య (టాస్‌) జిల్లా అధ్యక్షురాలు జ్యోతి, ప్రతినిధులు సానియా, ఎంవీ ఫౌండేషన్‌ సిబ్బంది శ్రీనివాస్, వెంకటయ్య అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ నారాయణరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలు గ్రామాలకు బస్సు సౌకర్యం లేక విద్యార్థినులు, మహిళలు, పెద్దలు అవస్థలు పడుతున్నారన్నారు.తప్పనిసరై ప్రైవేటు వాహనాలపై ఆధారపడి అధిక మొత్తంలో డబ్బు వెచ్చించాల్సి వస్తోందన్నారు.  మండల పరిధిలోని పులుమద్ది, ఎర్రవల్లి, సర్పన్‌పల్లి, అత్వెల్ల్లి, మదన్‌పల్లి, పాతూరు, కామారెడ్డిగూడ, బూరాన్‌పల్లి, పులుసుమామిడి, పీరంపల్లి, కొటాలగూడ గ్రామాలకు బస్సులు లేవని వారు తెలిపారు. ఈ గ్రామాలకు కరోనా సమయంలో బస్సులను నిలిపి వేసి నేటికీ తిరిగి ప్రారంభించలేదన్నారు. దీంతో బాలికలకు బడికి వెళ్లడానికి రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొందరు ఏకంగా చదువే మానేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిలిపివేసిన బస్సులను తిరిగి ప్రారంభించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు ఆశాలత, ఉమ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని