logo

హైకోర్టు ఆదేశాలతో విధుల్లోకి మాజీ సీఈఓ

హైకోర్టు ఆదేశాల మేరకు మాజీ సీఈఓ వెంకటయ్యను విధుల్లోకి తీసుకోవాలని నవాంద్గీ సహకారం సంఘం తీర్మానం చేసిందని అధ్యక్షులు వెంకట్‌రాంరెడ్డి తెలిపారు.

Published : 28 May 2024 02:52 IST

సమావేశమైన  వెంకట్‌రాంరెడ్డి, సభ్యులు 

బషీరాబాద్‌: హైకోర్టు ఆదేశాల మేరకు మాజీ సీఈఓ వెంకటయ్యను విధుల్లోకి తీసుకోవాలని నవాంద్గీ సహకారం సంఘం తీర్మానం చేసిందని అధ్యక్షులు వెంకట్‌రాంరెడ్డి తెలిపారు. సోమవారం నవాంద్గీ సహకార సంఘం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఏడాదిన్నర క్రితం శనగల కొనుగోలు తూకాల్లో మోసం జరిగిందని అప్పట్లో కేసు నమోదై సీఈఓగా విధులు నిర్వర్తిస్తున్న వెంకటయ్య సస్పెండ్‌ చేశారు. తాజాగా ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది. తాను సీఈఓగానే విధుల్లో ఉంటానని, తప్పు చేయలేదని తేలడంతోనే కోర్టు తనకు అనుకూలంగా ఉత్తర్వు ఇచ్చిందని, సాధారణ సిబ్బందిగా ఎందుకు పని చేస్తానని వెంకటయ్య పేర్కొన్నారు. ఉపాధ్యక్షులు అజయ్‌ప్రసాద్, అశోక్‌చంద్రగౌతం, శ్రీనివాస్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. 

  • సహకార సంఘంలో సభ్యత్వం కలిగిన రైతులు మరణిస్తే అంత్యక్రియల ఖర్చులకు రూ.9వేలు అందజేస్తామని నవాంద్గీ సహకారం సంఘం అధ్యక్షులు వెంకట్‌రాంరెడ్డి, ఎక్మాయి సభ్యుడు నారా గోపాల్‌రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయం కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటుందన్నారు. ఎక్మాయికి చెందిన రామయ్య సంఘం సభ్యుడిగా ఉండి ఇటీవల అనారోగ్యంతో మరణించాడు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు నగదు అందించారు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని