logo

గంజాయి అమ్మకాల్లో రౌడీషీటర్, అనుచరులు

ఓ రౌడీషీటర్‌ తన అనుచరులతో కలిసి గంజాయి అమ్మకాలు చేసే ప్రయత్నంలో ఉండగా ఖైరతాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం..

Published : 28 May 2024 03:04 IST

పట్టుబడిన సరకు, నిందితులతో పోలీసు అధికారులు 

ఖైరతాబాద్‌: ఓ రౌడీషీటర్‌ తన అనుచరులతో కలిసి గంజాయి అమ్మకాలు చేసే ప్రయత్నంలో ఉండగా ఖైరతాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్‌ ఇందిరనగర్‌ నివాసి పొదిళ్ల ప్రకాశ్‌రాజ్‌ అలియాస్‌ డాలర్‌ పింటు లక్డీకాపూల్‌లోని అయ్యప్ప టూర్స్, ట్రావెల్స్, ప్యాకర్స్, మూవర్స్‌లో హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడిపై రౌడీషీట్‌ ఉంది.   ఆదివారం సాయంత్రం ఖైరతాబాద్‌ బడా గణేష్‌ కూడలిలో మరో ఇద్దరు మిత్రులతో కలిసి అనుమానాస్పదంగా కనిపించాడు. తనిఖీ చేయగా 1100 గ్రాముల గంజాయి దొరికింది. అతడితో పాటు అదుపులోకి తీసుకున్న వారిలో లైటింగ్‌ పనులు చేసే కార్వాన్‌లోని తాళ్లగడ్డకు చెందిన జాడోన్‌ రోహన్‌ సింగ్‌ అలియాస్‌ పెర్మాల్‌సింగ్‌ వద్ద  కత్తి లభించింది. మూడో వ్యక్తి మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీకి చెందిన హన్మంత్‌ నితిన్‌గౌడ్‌ మాంసం దుకాణం నిర్వాహకుడు. ప్రకాశ్‌రాజ్‌ దూల్‌పేట నుంచి గంజాయి తెస్తే ముగ్గురూ కలిసి చిన్న పాకెట్లుగా తయారుచేసి విక్రయిస్తుంటారు. ముగ్గురిపైనా వివిధ పోలీస్‌ స్టేషన్లలో గతంలో గంజా కేసులు ఉన్నాయి. ప్రకాశ్‌రాజ్, రోహన్‌సింగ్‌ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో రీల్స్‌ సైతం చేస్తున్నట్లు గుర్తించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని