logo

పాదచారుల వెతలు తీర్చేలా...ఈస్ట్‌-వెస్ట్‌ను కలుపుతూ రైల్వే వంతెన

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ అనగానే అక్కడ కిక్కిరిసిన ప్రయాణికులు.. స్టేషన్‌కు బయట కూడా రద్దీ  అందరికీ గుర్తుకొస్తాయి.

Published : 28 May 2024 03:30 IST

స్టేషన్‌లో 1వ నంబరు ప్లాట్‌ఫాం నుంచి 10వ నంబరు ప్లాట్‌ఫాం వరకు ఉన్న ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి 

ఈనాడు, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ అనగానే అక్కడ కిక్కిరిసిన ప్రయాణికులు.. స్టేషన్‌కు బయట కూడా రద్దీ  అందరికీ గుర్తుకొస్తాయి. సికింద్రాబాద్‌ ఈస్ట్‌ (సంగీత్‌ చౌరస్తా) నుంచి వెస్ట్‌ (మెట్టుగూడ) వైపు ఒలిఫెంటా వంతెన కింద నుంచి దాటాలంటే గగనమే. ఇలాంటి అవస్థలకు ద.మ. రైల్వే చెక్‌ పెడుతోంది. తాజాగా రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్‌ ఈస్ట్‌ - వెస్ట్‌ను కలుపుతూ పాదచారుల వంతెనను 12 మీటర్ల విస్తీర్ణంతో రైల్వే నిర్మిస్తోంది. రేతిఫైల్‌ బస్సుస్టేషన్, గణేష్‌ మందిరం దాటాక ఈ వంతెన రోడ్డు పైనుంచే ప్రారంభమవుతుంది. ఇలా ఒకటో నంబరు ప్లాట్‌ఫామ్‌ నుంచి 10వ ప్లాట్‌ఫామ్‌ దాటే వరకు బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. దీనిద్వారా వెస్ట్‌ వైపు బోయిగూడలో దిగవచ్చు. ఎస్కలేటర్లను ఇరువైపులా అమరుస్తున్నారు. సాధారణ ప్రజలూ వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. సికింద్రాబాద్‌ ఈస్ట్‌ మెట్రోస్టేషన్‌తో అనుసంధానం చేసి ర్యాంపునూ నిర్మిస్తున్నారు. ఇప్పటికే 7, 8 ప్లాట్‌ఫామ్‌ల వరకు పనులయ్యాయి. మరో రెండు మూడు నెలల్లో ఈ పనులు పూర్తవుతాయని రైల్వే అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని