logo

Hyderabad: ట్యాంకర్ల బు‘కింగ్‌’లు.. దారి మళ్లుతున్న జలమండలి వాహనాలు

Eenadu icon
By Telangana Dist. Desk Updated : 26 Mar 2025 09:24 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

మూడు శాతం మందికే వంద శాతం

ఈనాడు, హైదరాబాద్‌: జనవరి నుంచి ఇబ్బడిముబ్బడిగా బుక్‌ అవుతున్న ట్యాంకర్ల వ్యవహారాన్ని జలమండలి నిగ్గుతేల్చింది. గతేడాది కంటే భారీగా బుక్‌ అవుతుండటంతో అధికారులకు అనుమానం వచ్చి పరిశీలించగా.. అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఓ అపార్ట్‌మెంట్‌ 70 రోజుల్లో 170 ట్యాంకర్లను బుక్‌ చేసి ఉపయోగించుకున్న అంశాన్ని గుర్తించారు. దీంతో అత్యధికంగా ట్యాంకర్లను బుక్‌ చేస్తున్న క్యాన్‌ నంబర్లను విశ్లేషించి కారణాలు తెలుసుకుంటున్నారు. 

ఓ అపార్ట్‌మెంట్‌ కథ.. అత్యధిక ట్యాంకర్లను బుక్‌ చేసిన క్యాన్‌ నంబర్‌ ఆధారంగా ఓ అపార్ట్‌మెంట్‌ని గుర్తించారు. 50 ఫ్లాట్‌లు ఉన్న ఆ అపార్ట్‌మెంట్‌లో 45 ఫ్లాట్‌లు ఉచిత నీటి పథకం కింద ప్రయోజనం పొందుతున్నాయి. సగటున రెండు రోజులకు ఐదు ట్యాంకర్‌ల చొప్పున 171 బుక్‌ చేసినట్లు గుర్తించారు. ఒక్కో ఫ్లాట్‌కు నెలకు 20000 లీటర్ల ఉచిత నీరు సరఫరా చేస్తున్నా రోజుకు రెండు ట్యాంకర్లకు పైగా బుక్‌ చేశారు. 

  • జనవరి ఒకటి నుంచి మార్చి 17 వరకు 3,16,300 ట్యాంకర్లను బుక్‌ చేయగా ఇందులో 50 శాతం 4,711 మంది వినియోగించుకోవడం గమనార్హం. 
  • జనవరి ఒకటి నుంచి మార్చి 17 వరకు 3,16,300 ట్యాంకర్లను బుక్‌ చేయగా ఇందులో 50 శాతం 4,711 మంది వినియోగించుకోవడం గమనార్హం. 
  • ప్రస్తుతం రోజుకు 9500 ట్యాంకర్లను సరఫరా చేస్తుండగా మార్చి 10, 11 తేదీల్లో ఏకంగా 10,200 బుక్‌ అయ్యాయి. 
  • జలమండలికి 13.5 లక్షల క్యాన్‌ నంబర్లు ఉండగా ఇందులో కేవలం 45,598 మంది నుంచి మాత్రమే ట్యాంకర్లు బుక్‌ అయ్యాయి. 
  • 70 రోజుల్లో వంద ట్యాంకర్లు అంతకంటే ఎక్కువ ట్యాంకర్లను 28 మంది బుక్‌ చేసినట్లు గుర్తించారు. 
  • అపార్ట్‌మెంట్లను హాస్టళ్లుగా నడుపుతూ ఎక్కువ నీటిని తీసుకుంటున్నారా? అనేది గుర్తిస్తున్నారు.  
Tags :
Published : 26 Mar 2025 09:19 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని