logo

TG News: నాలుగు పథకాల లబ్ధిదారుల ఎంపిక.. కలెక్టర్లకు సీఎస్‌ కీలక సూచనలు

Eenadu icon
By Telangana Dist. Team Published : 15 Jan 2025 20:35 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్న నాలుగు కొత్త పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం ఈనెల 21 నుంచి గ్రామసభలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. ఎలాంటి అపోహలకు తావు లేకుండా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. గ్రామ పంచాయతీలు, పట్టణాలు, నగరాల్లో గ్రామ, వార్డు సభలు నిర్వహించాలన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల పథకాల లబ్ధిదారుల ఎంపికపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతు భరోసా కోసం భూముల వివరాలను రెవెన్యూ శాఖ ద్వారా వ్యవసాయ శాఖకు పంపించినట్లు సీఎస్ తెలిపారు.

‘‘క్షేత్రస్థాయిలో పరిశీలించి సాగుయోగ్యం కాని భూములను గుర్తించాలి. వాటి వివరాలను గ్రామసభల్లో ప్రదర్శించాలి. ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ కోసం కనీసం 20 రోజులు ఉపాధి హామీ పనులకు వెళ్లిన భూమి లేని రైతు కూలీల కుటుంబాలను గుర్తించి.. ఆ జాబితాను గ్రామ సభల్లో ప్రకటించాలి. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం లబ్ధిదారుల ముసాయిదా జాబితాను గ్రామ, వార్డు సభల్లో వివరించి ఆమోదం పొందాలి. అభ్యంతరాలుంటే స్వీకరించాలి. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్ఎంసీ) పరిధిలో లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున.. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని కలెక్టర్లకు సీఎస్‌ సూచనలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని