logo

Rain: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. పలు చోట్ల ట్రాఫిక్‌ జామ్‌

Eenadu icon
By Telangana Dist. Team Updated : 21 Sep 2024 22:51 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: నగరంలో పలు చోట్ల శనివారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. సికింద్రాబాద్‌, తార్నాక, నాచారం, ఉప్పల్‌, రామంతాపూర్‌, మేడిపల్లి, కోఠి, చిక్కడపల్లి, ముషీరాబాద్‌, ఎల్బీనగర్‌, మాదాపూర్‌ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. ఐటీ కారిడార్‌తోపాటు సికింద్రాబాద్‌, ఉప్పల్‌, ఎల్బీనగర్‌ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. రాత్రి 8:30 గంటల వరకు అత్యధికంగా ఖైరతాబాద్‌లో దాదాపు 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గోల్కొండలో 7.3, ఆసిఫ్‌నగర్‌లో 7.1, మెహదీపట్నంలో 6.4, సికింద్రాబాద్‌లో 5.8, నాంపల్లి, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో 5 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌

నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్నందున ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని, అత్యవసరమైన పని ఉంటేనే బయటకు రావాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి నగరవాసులను కోరారు. బలమైన గాలులు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్నందున ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. జీహెచ్ఎంసీ క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉన్నారని, వరద నీరు నిలిచిన ప్రాంతాల్లో సిబ్బంది, డీఆర్ఎఫ్‌ బృందాలు పనిచేస్తున్నాయన్నారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు, చెరువులు, కుంటలు, నాలాల వద్ద ఉండొద్దని కమిషనర్ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ హెల్ప్‌ లైన్ 04-2111 1111 నంబర్‌కు సంప్రదించాలని, డీఆర్ఎఫ్ 9000113667 నంబర్ కు సంప్రదించాలని సూచిచారు.



Tags :
Published : 21 Sep 2024 20:11 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని