logo

Hyderabad: వినియోగదారుల డిమాండ్‌.. ఓటీఎస్‌ గడువు పొడిగించిన జలమండలి

Eenadu icon
By Telangana Dist. Team Published : 02 Nov 2024 19:43 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: మొండి బకాయిల వసూలుకు జలమండలి తీసుకువచ్చిన వన్‌టైం సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) గడువును మరో నెల రోజులు పొడిగించారు. గురువారంతో గడువు ముగిసిన నేపథ్యంలో మరో నెలరోజులు పొడిగించాలని జలమండలి ఎండీ కె.అశోక్‌రెడ్డి పురపాలకశాఖకు లేఖ రాశారు. దీంతో ఓటీఎస్‌ గడువును నవంబరు 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది. బకాయిల చెల్లింపునకు వడ్డీ, అపరాధ రుసుం మాఫీ చేస్తూ అసలు మాత్రం చెల్లించేలా ఓటీఎస్‌ను అక్టోబర్‌ 1నుంచి అమలు చేస్తున్నారు. 

ఇప్పటి వరకు 70,335 మంది వినియోగించుకున్నారని జలమండలి అధికారులు తెలిపారు.  వాస్తవంగా అక్టోబర్‌ 1నుంచి ఓటీఎస్‌ అమల్లోకి వచ్చినట్లున్నా ఉత్తర్వులు వెలువడటానికి ఐదు రోజులు పట్టింది. దీంతో పాటు దసరా, బతుకమ్మ పండగ సెలవుల నేపథ్యంలో ఓటీఎస్‌ను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేక పోయారని జలమండలి భావిస్తోంది. స్పందన 30 శాతంలోపే ఉండటంతో వినియోగదారుల డిమాండ్‌ మేరకు మరో నెలరోజులు పొడిగిస్తున్నట్టు జలమండలి ఎండీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని