ముమ్మరంగా నేతల ప్రచారాలు
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికస్థానాల్లో విజయం సాధించి కేంద్రంలో కూడా అధికారం చేపడుతుందని టీపీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీగౌడ్, భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇంఛార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు.
యాచారంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, చిత్రంలో మల్రెడ్డి రంగారెడ్డి, ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి
న్యూస్‌టుడే బృందం: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికస్థానాల్లో విజయం సాధించి కేంద్రంలో కూడా అధికారం చేపడుతుందని టీపీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీగౌడ్, భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇంఛార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు. యాచారంలో ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డితో కలిసి కర్నార్ మీటింగ్‌లో వారు మాట్లాడారు.
- మహేశ్వరం మండలం తుమ్మలూరు వద్ద కందుకూరు టీపీసీసీ కార్యదర్శి బోధమాదవరెడ్డి, జడ్పీటీసీ సభ్యులు బొక్క జంగారెడ్డి, మాజీ జడ్పీఫ్లోర్‌లీడర్ ఏనుగు జంగారెడ్డి, జి.జానకిరామ్ ప్రచారం చేశారు.
- బడంగ్‌పేట పరిధిలోని శ్రీకృష్ణ ఎంక్షేవ్, సాయినగర్, సాయిబాలాజీ కాలనీ, సీతహోమ్స్ తదితర కాలనీల్లో మేయర్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శ పారిజాత ప్రచారం నిర్వహించారు.
- తాటిపర్తి గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన పలువురు.. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
- కప్పపాడ్కు చెందిన వివిధ పార్టీల నేతలు ఎండీ మునీర్, లతీఫ్, చాంద్‌బాయ్ తదితరులు మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ గురునాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
నందివనపర్తిలో ప్రచారం చేస్తున్న భువనగిరి భారాస అభ్యర్థి క్యామ మల్లేష్ కుమార్తె ఆరోని
- కొత్తగూడ, కొత్తూరు, బాచుపల్లి, జైత్వారం, పులిమామిడి, పెద్దమ్మ తండాలలో కేఎల్ఆర్ బూత్‌స్థాయి కమిటీలతోపాటు ముఖ్యకార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
- ఆర్కేపురంలో శనివారం కాంగ్రెస్ నేత పున్న గణేశ్ ఆధ్వర్యంలో బూత్ కమిటీల సమావేశాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, టీపీసీసీ సభ్యుడు దేప భాస్కర్‌రెడ్డి మాట్లాడారు.
- కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవిని గెలిపించాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి... పోలేపల్లి గ్రామం, కడ్తాల్ మండలం కానుగుబావితండ, గానుగుమర్ల తండాల్లో ప్రచారం చేపట్టారు. కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి భీక్యానాయక్, యాట నర్సింహా పాల్గొన్నారు.
- భువనగిరి భారాస ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ తరఫున ఆయన కుమార్తె ఆరోని అనాజ్‌పూర్‌లో ప్రచారం నిర్వహించారు.
- భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి ఓటు వేయాలని కోరుతూ ఎంపీటీసీ సభ్యులు సుదర్శన్‌యాదవ్, మల్లేష్, శ్రవణ్ మహేశ్వరంలో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు అందజేస్తూ ప్రచారం నిర్వహించారు.
- భాజపా ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి మద్దతుగా కొత్తగూడ, తిమ్మాపూర్‌లో కందుకూరు ఎంపీపీ మంద జ్యోతి ఆధ్వర్యంలో పార్టీ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
- భువనగిరి ఎంపీ సీపీఎం అభ్యర్ధి జహంగీర్‌ను గెలిపించాలని కోరుతూ శనివారం మంచాల, లోయపల్లి, తిప్పాయిగూడ గ్రామాలలో ఆ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దశాబ్ది స్ఫూర్తిగా.. శతాబ్దికి బాసటగా
[ 02-06-2024]
అరవై ఏళ్ల ప్రజల సుదీర్ఘ పోరాటం ఫలితంగా పదేళ్ల క్రితం తెలంగాణ స్వరాష్ట్రం కల సాకారమైంది. ఉద్యమాలకు ఊపిరిలూదిన హైదరాబాద్ గడ్డ ఆ రోజు ఎంతో పులకించింది. -
ఉద్యమానికి ఊపిరిలూదారు
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్ర సాధన క్రతువులో మొయినాబాద్ కీలకపాత్ర పోషించింది. ఈ ప్రాంతానికి చెందిన ముగ్గురు ఉద్యమానికి ఊపిరిలూది.. -
ప్రగతి కాంక్ష.. సాగాలి నిరంతర దీక్ష
[ 02-06-2024]
తెలంగాణ డయగ్నొస్టిక్ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు జిల్లాలో 1,05,103 మందికి వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వికారాబాద్ వైద్య కళాశాలకు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) అనుమతి మంజూరు చేసింది. -
ఫలితాల వెల్లడికి సర్వం సన్నద్ధం
[ 02-06-2024]
రాజధాని పరిధిలోని నాలుగు ఎంపీ స్థానాలు, ఓ అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపునకు సమయం ఆసన్నమైంది. సుమారు ఆరు వేల మంది ఉద్యోగులు ఈనెల 4న ఓట్ల లెక్కింపులో పాల్గొననున్నారు. -
జైలుకెళ్లినా మార్పు రాలె..!
[ 02-06-2024]
నలుగురు స్నేహితులు.. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలే లక్ష్యంగా చేసుకున్నారు.. పలు చోరీల కేసుల్లో పోలీసులు అరెస్టుచేసి జైలుకు పంపినా వారిలో మార్పు రాలేదు. -
గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతూ..
[ 02-06-2024]
గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ యువతి తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మేడ్చల్ ఠాణా పరిధిలో శనివారం జరిగింది. -
బుల్కాపూర్ నాలా బఫర్ జోన్ కబ్జా
[ 02-06-2024]
నగరానికి చెందిన వరద నీటిని మోసుకెళ్లే ప్రధాన కాలువల్లో బుల్కాపూర్ నాలా కీలకమైంది. శతాబ్దాల క్రితమే నగర ప్రజలను వరద ముంపు నుంచి కాపాడేందుకు ప్రణాళికాబద్ధంగా నాటి నిజాం పాలకులు తవ్వించగా.. -
డబ్బులిచ్చుకో.. నిరభ్యంతరంగా పత్రాలు పుచ్చుకో
[ 02-06-2024]
రాజధాని నగరం శివారు ప్రాంతాల్లోని చెరువులు..వాగుల్లో రియల్ వెంచర్లు వేసుకునేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు సహకరించారు. -
దేశ భద్రతకు మూలస్తంభాలుగా నిలవాలి
[ 02-06-2024]
సవాళ్లను అధిగమించేందుకు కృషి, పట్టుదల, ఐక్యత, చిత్తశుద్ధి దేశ భద్రతకు మూలస్తంభాలుగా నిలుస్తాయని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)ఎయిర్ పోర్టు సెక్టార్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ప్రవీర్ రంజన్ తెలిపారు. -
రౌడీషీటర్ హత్యకు పథక రచన
[ 02-06-2024]
ఇద్దరు రౌడీషీటర్ల మధ్య తలెత్తిన గొడవతో ఒకరిపై మరొకరు పగ పెంచుకున్నారు. వారిలో ఒకరి హత్యకు పథకం వేసి అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. -
ఉచిత న్యాయం.. మరింత చేరువ
[ 02-06-2024]
కాలంతోపాటు నేరాలు, అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నాయి. వీటివల్ల బాధితులకు సత్వర న్యాయం జరగాలి. ఈ నేపథ్యంలో జిల్లాలో న్యాయసేవలు విస్తృతమవుతున్నాయి. -
డ్రైవింగ్ లైసెన్సులు పాత విధానంలోనే
[ 02-06-2024]
డ్రైవింగ్ లైసెన్సులను యథావిధిగా రవాణాశాఖ కార్యాలయాల్లోనే జారీ చేయనున్నారు. డ్రైవింగ్ లైసెన్సింగ్ విధానాన్ని మరింత సరళతరం చేస్తున్నట్లు గతంలో కేంద్రం ప్రకటించింది. -
యాప్‌లతో డ్రగ్స్ సరఫరా
[ 02-06-2024]
రెండు వేర్వేరు కేసుల్లో నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న వి.లక్ష్మిపతి(28), ఒకారో కాస్మోస్ రమ్సీ(38)లను టీఎస్ న్యాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. -
పనిచేసే సంస్థకు ఉద్యోగుల కన్నం
[ 02-06-2024]
డిజిటల్ చెల్లింపులకు సంబంధించిన క్యూఆర్ కోడ్ మార్చేసి ప్రైవేటు సంస్థలో రూ.4.15 కోట్లు కొట్టేసిన మోసంలో సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) పోలీసులు ఇద్దర్ని అరెస్టు చేశారు. -
నకిలీ పాస్‌పోర్టుల కుంభకోణంలో ముగ్గురి అరెస్టు
[ 02-06-2024]
నకిలీ పాస్‌పోర్టుల కుంభకోణంలో తెలంగాణ సీఐడీ మరో ముగ్గుర్ని అరెస్టు చేసింది. ఇందులో ఇద్దరు శ్రీలంక దేశస్థులు ఉండడం గమనార్హం.