logo

Ap News: వెంకటయ్య ఆశయ సాధనకు కృషి చేయాలి

కార్మిక సంఘం నాయకుడు వెంకటయ్య ఆశయ సాధన కోసం ప్రతి కార్మికుడు కృషి చేయాలని ఆసంఘం నాయకులు వైవీ వెంకటేశ్వర్లు, ఎల్లయ్య పేర్కొన్నారు.

Published : 25 May 2024 16:05 IST

బేతంచెర్ల: కార్మిక సంఘం నాయకుడు వెంకటయ్య ఆశయ సాధన కోసం ప్రతి కార్మికుడు కృషి చేయాలని ఆసంఘం నాయకులు వైవీ వెంకటేశ్వర్లు, ఎల్లయ్య పేర్కొన్నారు. శనివారం కామ్రేడ్ వెంకటయ్య వర్ధంతి సందర్భంగా లారీ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో ఆ యూనియన్ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర, సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. లారీ డ్రైవర్ల సమస్య పరిష్కారం కోసం, వారి హక్కుల కోసం, కార్మికుల సంక్షేమం కోసం పోరాడే వ్యక్తి అని కొనియాడారు. కార్యక్రమంలో మోటార్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు సంజీవ నాయుడు, మద్దిలేటిస్వామి, వెంకటేశ్ నాయక్, మధు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని