logo

Kurnool: మార్కెట్ యార్డు వ్యాపారి ఐపీ

ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఓ వ్యాపారి ఐపీ పెట్టిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Published : 25 May 2024 15:39 IST

ఆదోని మార్కెట్: ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఓ వ్యాపారి ఐపీ పెట్టిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రూ.50 లక్షలు విలువకు ఐపీ పెట్టాడు. మార్కెట్ యార్డ్‌లో 12 మంది కమిషన్ ఏజెంట్లతో పాటు మార్కెట్ యార్డ్ కార్యాలయానికి, నాలుగు బ్యాంకులకు ఐపీ నోటీసులు పంపినట్లు సమాచారం. ఈనెల 22వ తేదీన ఐపీ నోటీస్ పంపినట్లు తెలుస్తోంది. అయితే ఐపీ పెట్టిన వ్యాపారి తన పేరు మీద కాకుండా, తన అన్న పేరు మీద వ్యాపారం చేస్తుండడం విశేషం. తన వద్ద రెండు షర్ట్స్‌.. రెండు ప్యాంట్లు మాత్రమే ఉన్నట్లు ఐపీ నోటీసులో పేర్కొన్నాడు. విషయం తెలిసి మార్కెట్ యార్డ్‌లో కమీషన్ ఏజెంట్లు, తోటి వ్యాపారులు తీవ్ర కలవరపాటుకు గురయ్యారు. ఇదే వరుసలో ఐదు, ఆరుగురు వ్యాపారులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా స్థానికంగా ఊర్లో లేకుండా అదృశ్యమయ్యారు. దీంతో అప్పులు ఇచ్చిన కమిషన్ ఏజెంట్లు, రైతులు లబోదిబోమంటున్నారు. మార్కెట్ యార్డ్‌కు రావాల్సిన సెస్‌కు సైతం బొక్క పడింది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు