logo

తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు

వేసవి దృష్ట్యా జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ డా.మనజీర్‌ జిలాని సామూన్‌ ఆదేశించారు.

Published : 25 Mar 2023 01:47 IST

సమీక్షిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ, జాయింట్‌ కలెక్టర్‌ ఇతర అధికారులు

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : వేసవి దృష్ట్యా జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ డా.మనజీర్‌ జిలాని సామూన్‌ ఆదేశించారు. నంద్యాల సెంటినరి హాల్‌లో శుక్రవారం తాగునీటి సరఫరా, వడగాల్పులు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్పీ రఘువీర్‌రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ నిశాంతి, అదనపు ఎస్పీ రమణ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ మనోహర్‌, జడ్పీ డిప్యూటీ సీఈవో సుబ్బారెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ రవిచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎండిపోయిన బోర్లు లోతు పెంచడం, ఇతర మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. పాఠశాలలు, గ్రామాల్లో పనిచేయని ఆర్వో ప్లాంట్లను గుర్తించి మరమ్మతులు చేయించాలన్నారు. ఎండ తీవ్రత, వడగాల్పుల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. మున్సిపల్‌, మండల కేంద్రాల్లో చలివేంద్రాలు, చలువపందిళ్లు ఏర్పాటు చేయాలన్నారు. డీపీవో శ్రీనివాసులు, డీఆర్డీఏ పీడీ శ్రీధర్‌రెడ్డి, డ్వామా పీడీ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని