logo

పెద్దాస్పత్రిలో పిచ్చికుక్క స్వైరవిహారం

కర్నూలు నగరంలోని సర్వజన వైద్యశాలలో పిచ్చికుక్క శుక్రవారం ఉదయం స్వైరవిహారం చేసింది. దీంతో రోగులు పరుగులు తీశారు.

Published : 18 May 2024 01:51 IST

ఐదుగురికి గాయాలు

పిచ్చికుక్క దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారి నాగలక్ష్మి

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే : కర్నూలు నగరంలోని సర్వజన వైద్యశాలలో పిచ్చికుక్క శుక్రవారం ఉదయం స్వైరవిహారం చేసింది. దీంతో రోగులు పరుగులు తీశారు. మొదట నాగలక్ష్మి (3) అనే చిన్నారి మొహంపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. అనంతరం తులసి అనే సెక్యూరిటీ సిబ్బంది, డాక్టర్‌సతీశ్‌తోపాటు మరో ఇద్దరిపై దాడి చేసింది. నాగలక్ష్మి పెదవిని కొరికేయడంతో పాపను అత్యవసర విభాగంలో చేర్పించారు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై పిచ్చికుక్కను చంపేశారు. ఏకంగా పెద్దాస్పత్రిలోకి పిచ్చికుక్క వచ్చి పలువురిపై దాడి చేయడంతో రోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.


విద్యుదాఘాతంతో 11 ఏళ్ల బాలుడి మృతి

చిన్నతుంబళ(పెద్దకడబూరు), న్యూస్‌టుడే: పెద్దకడబూరు మండలం చిన్నతుంబళంలో విద్యుదాఘాతానికి గురై 11 ఏళ్ల బాలుడు శుక్రవారం మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి రామాంజనేయులు, లక్ష్మి దంపతుల కుమారుడు శివ(11) తోటి పిల్లలతో కలసి శిథిలమైన ఇంట్లోకి కుక్క పిల్లను పట్టుకోడానికి వెళ్లారు. అక్కడ తెగిపడిన విద్యుత్తు తీగ మెడకు తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. దాంతో తోటి పిల్లలు కేకలు వేస్తూ వెళ్లి కుటుంబ సభ్యులకు చెప్పారు. సమాచారం తెలుసుకున్న తల్లిండద్రులు ఘటనా స్థలానికి చేరుకోగా బాలుడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుడంగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తల్లిదండ్రులు బోరున విలపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని