logo

శ్రీమఠంలో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి

రాఘవేంద్రస్వామి దర్శనార్థం కర్నూలు అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి జి.భూపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులతో శుక్రవారం మంత్రాలయం వచ్చారు.

Published : 18 May 2024 01:52 IST

మఠం ప్రాకారంలో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి జి.భూపాల్‌రెడ్డి

మంత్రాలయం, న్యూస్‌టుడే: రాఘవేంద్రస్వామి దర్శనార్థం కర్నూలు అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి జి.భూపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులతో శుక్రవారం మంత్రాలయం వచ్చారు. వీరు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను, అనంతరం రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. పీఠాధిపతి వీరికి శేషవస్త్రం, ఫలమంత్ర అక్షతలు ఇచ్చి ఆశీర్వదించారు. మంత్రాలయం ఎస్సై గోపినాథ్‌, మఠం అధికారి పురాణిక్‌స్వామి, మఠం ప్రొటోకాల్‌ కానిస్టేబుల్‌ రంగస్వామి పాల్గొన్నారు.


సుంకేసులలో కేఆర్‌ఎంబీ సభ్యుడు

కర్నూలు జలమండలి, న్యూస్‌టుడే : సుంకేసుల జలాశయాన్ని కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సభ్యుడు డాక్టర్‌ ఆర్‌.ఎన్‌.సాంత్వా శుక్రవారం పరిశీలించారు. తుంగభద్ర నదికి వచ్చే వరదనీరు, విడుదల తదతర వివరాలను కేసీసీ ఈఈ తిరుమలేశ్‌రెడ్డి, కర్నూలు డీఈఈ రఘురాంరెడ్డితో మాట్లాడి తెలుసుకున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలు, వైఎస్సార్‌ జిల్లాలో కేసీ కాల్వ కింద 2.75 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోందని వివరించారు. పలు అంశాలు వివరించారు. వీరి వెంట ఈఈ శివశంకరయ్య, కేసీసీ ఏఈ రాజు ఉన్నారు. అనంతరం ఆయన జూరాల ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని