logo

మోహినీ రూపంలో జ్వాలా నృసింహుడు

అహోబిలం జ్వాలా నృసింహస్వామి మోహినీ అలంకృతులై భక్తులకు దర్శనమిచ్చారు. వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో స్వామికి మోహినీ అలంకారం చేశారు.

Published : 18 May 2024 02:00 IST

ఆళ్లగడ్డ గ్రామీణం, న్యూస్‌టుడే : అహోబిలం జ్వాలా నృసింహస్వామి మోహినీ అలంకృతులై భక్తులకు దర్శనమిచ్చారు. వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో స్వామికి మోహినీ అలంకారం చేశారు. శుక్రవారం ఉదయం మోహినీ అలంకరణలో స్వామి పట్టు వస్త్రాలు, ఆభరణాలు ధరించి పల్లకిపై కొలువుదీరారు.  మధ్యాహ్నం శ్రీదేవి, భూదేవి సమేత స్వామి వారిని పంచామృతాలతో అభిషేకం జరిపారు. రాత్రి జ్వాలా నృసింహ స్వామి, అమ్మవార్లు విశేష అలంకరణలో శరభవాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. దిగువ అహోబిలంలో వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను కొలువుంచి పంచామృతాలతో అభిషేకం జరిపారు.  సాయంత్రం స్వామి, అమ్మవార్లను పల్లకిపై కొలువుదీర్చి తిరువీధుల్లో ఊరేగించారు. ఆలయ ప్రధానార్చకుడు కిడాంబి వేణుగోపాలన్‌, మణియార్‌ సౌమ్యనారాయణన్‌ ఆధ్వర్యంలో ఉత్సవం నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని