logo

ఇసుకను తోడేస్తున్నారా? ఫోన్‌ చేయండి

తుంగభద్ర నదిలో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై ‘‘మా రీచ్‌లపై కన్నేయండి’’ శీర్షికన ‘ఈనాడు’లో శుక్రవారం కథనం ప్రచురితమైంది.. గనులు, భూగర్భశాఖ అధికారులు స్పందించారు.

Published : 18 May 2024 02:46 IST

టోల్‌ఫ్రీ నంబరు  (1800 599 4599) ఏర్పాటు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: తుంగభద్ర నదిలో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై ‘‘మా రీచ్‌లపై కన్నేయండి’’ శీర్షికన ‘ఈనాడు’లో శుక్రవారం కథనం ప్రచురితమైంది.. గనులు, భూగర్భశాఖ అధికారులు స్పందించారు. ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం టోల్‌ఫ్రీ నంబరును, మెయిల్‌ ఐడీ ఏర్పాటు చేసిందని గనులు, భూగర్భ శాఖ జిల్లా అధికారి టి.రాజశేఖర్‌ శుక్రవారం తెలిపారు. ఎవరైనా తమ ఫిర్యాదులను టోల్‌ఫ్రీ నంబరు 1800 599 4599కు లేదా.. మెయిల్‌ ఐడీ dmgapsandcomplaints@yahoo.com కి పంపొచ్చని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని