logo

అందని బియ్యం..పేదల ఆగ్రహం

హొళగుంద మండల పరిధిలోని గజ్జహళ్లిలో 17 రోజులైనా రేషన్‌ బియ్యం ఇవ్వలేదని గ్రామ సచివాలయం ఎదుట శుక్రవారం ఆందోళన చేపట్టారు. రామలింగ, శేఖర్‌, మంజు, మల్లమ్మ మాట్లాడుతూ 50 కుటుంబాలకు బియ్యం అందలేదన్నారు.

Published : 18 May 2024 02:49 IST

సచివాలయం ఎదుట ఆందోళన చేస్తున్న గజ్జహళ్లి గ్రామస్థులు

హొళగుంద, న్యూస్‌టుడే: హొళగుంద మండల పరిధిలోని గజ్జహళ్లిలో 17 రోజులైనా రేషన్‌ బియ్యం ఇవ్వలేదని గ్రామ సచివాలయం ఎదుట శుక్రవారం ఆందోళన చేపట్టారు. రామలింగ, శేఖర్‌, మంజు, మల్లమ్మ మాట్లాడుతూ 50 కుటుంబాలకు బియ్యం అందలేదన్నారు.

హాలహర్వి, న్యూస్‌టుడే: హాలహర్వి మండలంలోని జె.హొస్సళ్లి గ్రామంలో ఈ నెల రేషన్‌ సరకులు ఇంకా అందలేదని గ్రామస్థులు మల్లయ్య, లక్ష్మి, పద్దమ్మ, భాగ్యమ్మ, సుశాంతస్వామి, సాదు, నిఖితమ్మ తెలిపారు.

నేడూ రేషన్‌ సరకుల పంపిణీ

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: ‘‘గడపకు చేరని బియ్యం’’ శీర్షికన ‘ఈనాడు’లో శుక్రవారం కథనం ప్రచురితమవడంతో అధికారులు స్పందించారు. ప్రజల సౌకర్యార్థం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇంటింటికి రేషన్‌ పంపిణీని ఒకరోజు పొడిగించినట్లు కలెక్టర్‌ డా.జి సృజన ఒక ప్రకటనలో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని