logo

Nandyala: అక్రమాలపై విచారణ జరిపించాలి

రాయలసీమకే తలమానికంగా ఉన్న విజయ పాల డైరీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై నంద్యాల జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరిపించాలని నాయకులు కోరారు.

Published : 25 May 2024 19:22 IST

రైతునగరం (నంద్యాల): రాయలసీమకే తలమానికంగా ఉన్న విజయ పాల డైరీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై నంద్యాల జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరిపించాలని నాయకులు కోరారు. సీఐటీయూ అధ్యక్ష, కార్యదర్శులు ఏసురత్నం, నాగరాజు డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విజయ పాల డైరీ ఛైర్మన్ గా జగన్మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ప్రజల సొమ్మును వృథాగా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. బొగ్గు, పాలు, పెరుగు వంటి వాటిని పక్కదారి పట్టించి సొమ్ము చేసుకుంటున్నారన్నారు. ఈ సమావేశంలో నాయకులు తోట మద్దులు, లక్ష్మణ్, మహమ్మద్ గౌస్ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని