logo

Ponguleti: దత్తత గ్రామం వాసాలమర్రిని కేసీఆర్‌ ఆగం చేశారు: మంత్రి పొంగులేటి

Eenadu icon
By Telangana Dist. Team Updated : 19 Jun 2025 14:12 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

తుర్కపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటించారు. గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలను ఆయన పంపిణీ చేశారు. కేసీఆర్‌ ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారని.. అభివృద్ధి చేస్తానని చెప్పి ఆగం చేశారని విమర్శించారు.

‘‘ఇక్కడి ప్రజలకు నాడు ఇచ్చిన హామీలేవీ కేసీఆర్‌ నెరవేర్చలేదు. రాష్ట్రానికే వాసాలమర్రిని రోల్ మోడల్‌ చేస్తానన్నారు. కానీ ఈ చిన్న గ్రామాన్ని ఎలాంటి పరిస్థితికి తీసుకొచ్చారో ప్రత్యక్షంగా చూశాం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామంటూ బొమ్మలు చూపించి ఓట్లేయించుకున్నారు. ఏ గ్రామంలోనూ ఇళ్లు కట్టలేదు. భారాస ప్రభుత్వం చేసిన అప్పులకు రూ.6వేల కోట్ల వడ్డీ కడుతున్నాం. ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నాం’’ అని పొంగులేటి అన్నారు.

Tags :
Published : 19 Jun 2025 13:04 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు