logo

మానవత్వం చాటుకున్న బస్సు చోదకుడు, కండక్టర్‌

మల్కాన్‌గిరి జిల్లా కోరుకొండ సమితి ఎం.వి. 36 గ్రామం కూడలి వద్ద గాయాలతో ఉన్న వృద్ధురాలిని ఆరోగ్య కేంద్రంలో చేర్పించి బస్సు చోదకుడు, కండక్టర్‌ మానవత్వం చాటుకున్నారు. వివరాలకు వస్తే...

Published : 27 May 2024 03:35 IST

వృద్ధురాలిని మోసుకెళ్తున్న    చోదకుడు, పక్కన కండక్టర్‌ 

మల్కాన్‌గిరి, న్యూస్‌టుడే: మల్కాన్‌గిరి జిల్లా కోరుకొండ సమితి ఎం.వి. 36 గ్రామం కూడలి వద్ద గాయాలతో ఉన్న వృద్ధురాలిని ఆరోగ్య కేంద్రంలో చేర్పించి బస్సు చోదకుడు, కండక్టర్‌ మానవత్వం చాటుకున్నారు. వివరాలకు వస్తే... ఆదివారం ఉదయం ఎం.వి. 36 గ్రామం ముఖ్య రహదారిపై ఓ పికప్‌ వ్యాన్, ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ద్వి చక్ర వాహనంపై ఉన్న వృద్ధురాలికి గాయాలయ్యాయి. అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చినా రావడానికి ఆలస్యం కావడంతో, బలిమెల నుంచి మల్కాన్‌గిరికి వెళ్తున్న లక్ష్మీబస్సు చోదకుడు ధన గాదవా, కండక్టర్‌ శివ ముదులి వృద్ధురాలిని కోరుకొండ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వృద్ధురాలు సదరు సమితి తర్లకోట పంచాయతీ సి.కాలనీకి చెందిన యమున దిశారి (75)గా తెలిసింది. చోదకుడు, కండక్టర్‌లను పలువురు ప్రశంసించారు.

క్షతగాత్రులను ఆదుకున్న ఐఐసీ  

జయపురం, న్యూస్‌టుడే: ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు క్షతగాత్రులను బొరిగుమ్మ ఐఐసీ జుగల్‌ కిశోర్‌షా సొంత వాహనంలో ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. జయపురం- బొరిగుమ్మ జాతీయ రహదారి 26పైన ఆదర్శ్‌ విద్యాలయం సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు అంబులెన్స్‌ చోదకుడు ఫోన్‌ అందుబాటులో లేకపోవటంతో, ఐఐసీ జుగల్‌ కిశోర్‌ షాకు సమాచారం ఇచ్చారు. ఆయన సొంత వాహనంలో బాధితులను బొరిగుమ్మ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమించడంతో ఆదివారం జయపురంలోని జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఒకరు జయంతిగిరి పంచాయతీ బహుదూరగూడకు చెందిన గంగాబొత్రగా గుర్తించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని