logo

దర్యాప్తు నివేదికలు వెలుగులోకి తెస్తాం

బిజద 25 ఏళ్ల పాలనా కాలంలో జరిగిన అవినీతిపై సమగ్ర దర్యాప్తు చేయిస్తామని మాజీ మంత్రి, భాజపా అగ్రనేత కనకవర్ధన్‌ సింగ్‌దేవ్‌ చెప్పారు.

Published : 27 May 2024 03:36 IST

ఈసారి అధికారం భాజపాకే: సింగ్‌దేవ్‌

 కనకవర్ధన్‌ సింగ్‌దేవ్‌

భువనేశ్వర్, న్యూస్‌టుడే: బిజద 25 ఏళ్ల పాలనా కాలంలో జరిగిన అవినీతిపై సమగ్ర దర్యాప్తు చేయిస్తామని మాజీ మంత్రి, భాజపా అగ్రనేత కనకవర్ధన్‌ సింగ్‌దేవ్‌ చెప్పారు. ఆదివారం భువనేశ్వర్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ...  రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ జరగనంత అవినీతి నవీన్‌ హయాంలో జరిగిందన్నారు. సర్వత్రా అసంతృప్తి ప్రబలిందని, మార్పునకు శ్రీకారం చుట్టిన ప్రజలు ఈసారి భాజపాకు ఓట్లేశారన్నారు. మూడు విడతల పోలింగ్‌లో భారీ ఆధిక్యత ఉందని, చివరిదైన నాలుగోవిడత ఫలితాలు భాజపాకే అనుకూలిస్తాయన్నారు. కొద్ది రోజుల్లో పాలనా పగ్గాలు చేపట్టనున్న కొత్త ప్రభుత్వం పూరీ జగన్నాథుని రత్నభాండాగారంపై దృష్టి సారిస్తుందని, ఆలయం నాలుగు ద్వారాలు తెరిపిస్తుందన్నారు. చిట్‌ఫండ్‌ బాధితులందరికీ న్యాయం జరుగుతుందని, దీంతో ప్రమేయం ఉన్న వారంతా కారాగారానికి వెళ్లక తప్పదన్నారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని